Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ ఇలానే పుణ్యకాలాన్నీ పూర్తి చేస్తుందా?!
By: Tupaki Desk | 12 April 2015 11:56 AM ISTఎన్నికలు అయిపోయి దాదాపు ఏడాది కావొస్తోంది. అంతకు ఏడాది కిందటే కాంగ్రెస్ ఓటమి ఫిక్సయ్యింది. మరి కోలుకోవడానికి సంబంధించి అప్పుడే చర్యలు మొదలు పెట్టాల్సింది. తాము ఎక్కడెక్క పొరపాట్లు చేశామో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాల్సింది. అయితే అది జరగలేదు!
ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కోలుకోవడం గురించి ఎలాంటి ప్రయత్నాలూ చేయడం లేదు. రాహుల్ గాంధీనేమో లీవ్ అంటూ వెళ్లి పోయాడు.. సోనియాకు వయసయిపోయింది.. వీళ్ల నీడన జాతీయ స్థాయిలో మరో లీడర్ ఎదగలేదు! ఎదిగేప్రయత్నం చేసిన వారిని కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీనే తొక్కేసింది! ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్‌కు మరో దిక్కు లేకుండా పోయింది.
సొంతంగా ఎలాంటి సత్తువ లేకపోయినా కాంగ్రెస్ బలహీనతలను మాత్రమే తన బలాలుగా మార్చుకొంది భారతీయ జనతా పార్టీ. అధికారాన్ని సాధించుకొంది. ఏడాదిగా దిగ్విజయంగా ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో కూడా తన సత్తా చాటుతోంది. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
గ్రాండ్ ఓల్డ్‌పార్టీగా.. గ్రౌండ్ లెవల్లో మంచి కార్యకర్తల బలం ఉన్న పార్టీగా పేరు పొందిన కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితులను సద్వినియోగం చేసుకోవడం లేదని అయితే స్పష్టం అవుతోంది. దానికి ప్రధాన కారణం నాయకత్వ లోపమే అనుకోవాలి.
ఇలాంటి నేపథ్యంలో పార్టీ బలోపేతానికి మళ్లీ కమిటీలు, అధ్యయనాలూ అని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఆంధ్ర, తెలంగాణలకు కూడా ఈ విషయంలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనున్నారట!
మరి చిత్తశుద్ధి శివపూజలు అన్నట్టుగా.. కాంగ్రెస్‌లో ఇలాంటి తతంగాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అయితే ఫలితాలు మాత్రం ఉండవు. ఇది తొలిసారీ కాదు.. చివరి సారీ కాదు. పుణ్యకాలాన్ని అంతా కాంగ్రెస్ పార్టీ ఇలానే గడిపేస్తూ ఉంటుందేమో!