Begin typing your search above and press return to search.
పార్టీ కార్యాలయాన్నే మార్చేశాడు.. భట్టి నిప్పులు
By: Tupaki Desk | 30 July 2020 9:00 AM ISTఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. గెలిచాక టీఆర్ఎస్ పార్టీలోకి ఫ్లేట్ ఫిరాయించాడు. మణుగూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూడా రంగులు మార్చి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చేశాడు. ఎమ్మెల్యే మారడం సహజమే.. కానీ కానీ ఏకంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూడా మార్చడంపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. మణుగూరులో ఈ వివాదం చోటుచేసుకుంది.
మణుగూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని టీఆర్ఎస్ గా మార్చేశారు ఫిరాయింపు ఎమ్మెల్యే రేగా కాంతారావు. రాత్రికి రాత్రే రంగులు మార్చేసి టీఆర్ఎస్ కార్యాలయంగా చేశారు. దీనిపై భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
భట్టితోపాటు కొత్తగూడెం ఎమ్మెల్యే వీరయ్య, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, కాంగ్రెస్ నేతలు పాల్గొని ఈ చర్యపై నిరసన తెలిపారు.
ఎక్కడో టీచర్ గా పనిచేస్తున్న కాంతారావును తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి ఎమ్మెల్యేను చేస్తే పార్టీ ఫిరాయించి ఇప్పుడు సొంత పార్టీ కార్యాలయాన్ని కబ్జా చేస్తారా అని భట్టి ఎమ్మెల్యే రేగా కాంతారావుపై నిప్పులు చెరిగారు.
ఇక పోలీసులు భట్టి బృందాన్ని నిలవురించే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులను మోహరించారు. ఇక పార్టీ కార్యాలయం వివాదంపై తానే మీ చేయలేనని మున్సిపల్ కమిషనర్ కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేశారు.