Begin typing your search above and press return to search.

హుజూరాబాద్‌కు-కాంగ్రెస్‌కు మ‌ధ్య 40 ఏళ్ల వ్య‌త్యాసం.. ఇప్పుడు గెలుపంటే!

By:  Tupaki Desk   |   27 July 2021 8:40 AM GMT
హుజూరాబాద్‌కు-కాంగ్రెస్‌కు మ‌ధ్య 40 ఏళ్ల వ్య‌త్యాసం.. ఇప్పుడు గెలుపంటే!
X
మ‌కి కొద్ది వారాల్లోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో అధికార‌పార్టీ టీఆర్ ఎస్ దూకుడు పెంచింది. ఇక‌, ఇక్క‌డ నుంచి వ‌రుస విజ‌యాలు సాధించిన టీఆర్ ఎస్ మాజీ నాయ‌కుడు, మాజీ మంత్రి ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న ఈట‌ల రాజేంద‌ర్‌.. కూడా పాద‌యాత్ర పేరిట‌.. అప్పుడే.. ఎన్నిక‌ల ప్ర‌చారానికి కూడా దిగిపోయారు. ఇక‌, మిగిలిన మూడో పెద్ద‌పార్టీ.. కాంగ్రెస్ ఇప్ప‌టికి ఇక్క‌డ ఎలా ముందుకు సాగాల‌నే విష‌యంపై నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

హుజూరాబాద్‌ను తీసుకుంటే.. 1978 అంటే.. దాదాపు 40 సంవ‌త్స‌రాల‌కు కింద‌ట జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుంది. ఇక‌, ఆ త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు అంటే.. ఈ నాలుగు ద‌శాబ్దాల్లో ఏనాడూ.. కాంగ్రెస్ ఇక్క‌డ పుంజుకుంది లేదు. 2004కు ముందు జ‌రిగిన రెండు ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యం సాధించింది. ఇక‌, 2004 నుంచి ఇక్క‌డ టీఆర్ ఎస్ .. పాగా వేస్తున్న విష‌యం తెలిసిందే. ఈట‌ల రాజేంద‌ర్ ఇక్క‌డ 2009 నుంచి 2018 వ‌ర‌కు వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్నారు.

అంటే.. కాంగ్రెస్‌కు ఏమాత్రం ప‌ట్టు లేని..నియోజ‌క‌వ‌ర్గంగా.. హుజూరాబాద్ నిలిచింది. ఇలాంటి చోట పోటీ చేయాలా? వ‌ద్దా? అనేత‌ర్జ‌న భ‌ర్జ‌న కాంగ్రెస్‌లో భారీ ఎత్తున చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే ఒక‌వేళ పోటీ చేస్తే.. బీసీ వర్గానికి చెందిన ప్రముఖ తెలంగాణ ఉద్యమ నేత ఒకరిని అభ్యర్థిగా రంగంలోకి దించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఒక‌వేళ .. వ‌ద్ద‌నుకుంటే.. ఇండిపెండెంట్‌ అభ్యర్థికి బయటినుంచి మద్దతు ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక బీసీ నాయకుడు సరగం రవి పేరు పరిశీల‌న‌కు వ‌స్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని టీఆర్‌ఎస్‌ ఖరారు చేస్తే.. బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దించాలని కాంగ్రెస్‌ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 31న గాంధీభవన్‌లో జరిగే పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశంలో హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికపై స‌మాలోచ‌న‌లు చేసి.. అభ్యర్థి ఎవరన్నదా నిపై కొంత స్పష్టత ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అయితే.. ఎవ‌రిని నిలబెట్టినా.. కాంగ్రెస్‌కు ఇక్క‌డ గెలుపు మాత్రం అంత ఈజీకాదు..మ‌రో మాట‌లో చెప్పాలంటే.. నోటా కంటే మెరుగైన ఓట్లు సంపాయిస్తే.. గ్రేటే అంటున్నారు ప‌రిశీల‌కులు.