Begin typing your search above and press return to search.
ఏపీలో కాంగ్రెస్ పొత్తు... ఆ రెండు పార్టీల వైపు చూపు...?
By: Tupaki Desk | 20 April 2022 10:00 PM ISTకాంగ్రెస్ పార్టీ బలం, బలహీనతలు స్కానింగ్ చేసినట్లుగా ప్రశాంత్ కిశోర్ ఇట్టే చెప్పేశారు. నిజానికి అవన్నీ కాంగ్రెస్ పెద్దలకు తెలియనివి కావు. కానీ కొత్త వారు వచ్చి చెబితే బహు చక్కగా ఉంటుంది. వినేందుకు కూడా బాగా ఉంటుంది. ఇక జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి దీనంగా ఉంది. బలం ఉండి కూడా నూతిలో కప్పలా ఉండిపోతోంది.
దానికి ప్రశాంత్ కిశోర్ చెప్పిన మాట ఏంటి అంటే కాంగ్రెస్ ఇన్నేళ్ళ తన ప్రాభవాన్ని సరిగ్గా పొలిటికల్ గా మార్కెటింగ్ చేసుకోవడం లేదట. అలాగే, న్యూ జనరేషన్ తో కనెక్షన్లు వెరీ వీక్ గా ఉన్నాయట. మరోవైపు చూస్తే భారత దేశాన మూలన చూసినా కాంగ్రెస్ కి బలం ఉన్నా దాన్ని సరిగ్గా వాడుకోవడంలేదని కూడా చెప్పేశారు. కాంగ్రెస్ కి మొత్తం బలం ఉన్న వాటిని, గెలిచే చోట్లను గుర్తించి అక్కడ మాత్రమే పనిచేయాలని మిగిలిన చోట్ల పొత్తులతో బయటపడాలని కూడా పీకే సూచించారు.
సరే అవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాల్సిన రాష్ట్రాలలో పశ్చిమ బెంగాల్, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ఉన్నట్లుగా పీకే హై కమాండ్ కి నివేదిక ఇచ్చారు. తెలంగాణాలో కాంగ్రెస్ పొత్తు ఎవరితో అన్నది ఒక ముచ్చట. పశ్ఛిమ బెంగాల్ లో కాంగ్రెస్ మొత్తం బలం మమతా బెనర్జీకి వెళ్లిపోయింది. మరి మమతతో రేపటి రోజున అవసరం ఉంది అనుకుంటే ఆ పార్టీతోనే చెలిమి చేయాలి. లేకపోతే కామ్రేడ్స్ తో దోస్తీ కట్టాలి.
ఏపీ వీటన్నింటి కంటే చిత్రమైన పరిస్థితి. ఇక్కడ కూడా కాంగ్రెస్ కుదేల్ అయిపోయింది. కాంగ్రెస్ బలం చూస్తే టోటల్ గా వైసీపీకి పర్మనెంట్ గా వెళ్ళిపోయింది. దాంతో కాంగ్రెస్ కృంగిపోయింది. కోలుకోవడం అంటే కష్టమే. కానీ పొత్తులతో కాంగ్రెస్ ఎంతో కొంత ఉనికి ఏపీలో చాటుకోవచ్చు అని పీకే హై కమాండ్ కి సలహా ఇస్తున్నారు. మరి ఏపీలో ఏ పార్టీ కాంగ్రెస్ తో పొత్తుకు వస్తుంది అన్నది ఒక పెద్ద చర్చ.
నిజానికి కాంగ్రెస్ కి బీజేపీ జాతీయ స్థాయిలో పెద్ద శతృవు. ఏపీలో చూస్తే జగన్ ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్ కి ఊపిరి పోయడానికి సిద్ధపడరు. ఆ విధంగా చూస్తే ఈ రెండు పార్టీలతో కటీఫమ్. మరి కామ్రేడ్స్ తో పొత్తు పెట్టుకున్నా పెద్దగా కలసివచ్చేది లేదు. అటూ ఇటూ చూస్తే టీడీపీతోనే కాంగ్రెస్ కలసి నడవాలి. తెలంగాణాలో ఎలాగూ 2018 ఎన్నికల్లో ఒకసారి చేతులు కలిపారు కాబట్టి ఈసారి కూడా అదే పని చేయాలి.
అయితే ఏపీలో కాంగ్రెస్ తో పొత్తుకు టీడీపీ సై అంటుందా అన్నది ప్రశ్న. అలా ఒకే చెబితే జనాలు ఎంతవరకూ ఆమోదిస్తారు అన్నది కూడాలి. కాంగ్రెస్ టీడీపీ పొత్తు అంటే జనాలు కొడతారు అని నాలుగేళ్ల క్రితం మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు గట్టిగానే సౌండ్ చేసిన సంగతి విధితమే. మరో వైపు కాంగ్రెస్ కూటమిగా ఏర్పడి దేశంలో అధికారంలోకి వస్తుంది అనుకుంటే బాబు ఏ రకమైన విమర్శలు వచ్చినా పొత్తుకు రెడీ అవుతారు. అలా కాని నాడు ఆయన దూరంగానే ఉంచుతారు.
మొత్తానికి పీకే కాంగ్రెస్ టచ్ లోకి వెళ్ళడం కాదు కానీ ఏపీలో జగన్ కి మేలు చేస్తున్నారా కీడు చేస్తున్నారా అన్నది మాత్రం తెలియడం లేదు. ఒక వైపు మళ్ళీ ఏపీలో జగన్ అధికారంలోకి తీసుకురావలని పీకే టీమ్ గట్టిగా పనిచేస్తోంది. ఇంకో వైపు కాంగ్రెస్ ఏపీలో పొత్తులు పెట్టుకోవాలని అంటోంది. మరి పీకే దృష్టిలో ఆ పొత్తులేవో జగన్ తోనే అన్నదే మాస్టర్ ప్లానా. అదే అయితే అసాధ్యం అని చెప్పలేం కానీ కష్టం అని అనుకోవాలి. అయితే రాజకీయాలో ఎపుడేమి జరుగుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి పీకే అటు కాంగ్రెస్ కి ఇటు వైసీపీకి మధ్యన సంధానకర్త అవుతున్నారా అన్న డౌట్లు అయితే ఒక్కసారిగా పుట్టుకువస్తున్నాయి.