Begin typing your search above and press return to search.
అమిత్ షాకు కేంద్ర చట్టాలు వర్తించవా.?
By: Tupaki Desk | 18 Jan 2019 12:41 PM ISTప్రత్యర్థులను ఈడీ - ఐటీ - ఇంటెలిజెన్స్ వంటి సంస్థలతో బెంబేలెత్తిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎవ్వరు ఎక్కడ దొరికినా పాత కేసులు తిరగదోడి వేధించడం మొదలుపెడుతోంది. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అయిన చిదంబరంను - ఆయన కుమారుడు కంపెనీలను ఇలాగే టార్గెట్ చేసి వేధించింది. కానీ ఈ చట్టాలు - న్యాయాలు - కేసులు మాత్రం అధికార బీజేపీకి పట్టవనే కామెంట్ వినపడుతోంది.
తాజాగా అమిత్ షా ఎన్నికల ఆఫిడవిట్ ను సంపాదించిన స.హ. చట్టం ఉద్యమకారులు ఆయన తన ఆఫిడవిట్ పేర్కొనని ఆస్తులను చూపించి అమిత్ షాపై ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే ప్లేసులో ఎవరైనా తమ ఆస్తులను ఎన్నికల ఆఫిడవిట్ లో చూపకపోయినా.. వివరాలు చెప్పకపోయినా.. వాళ్ల నామినేషన్ ను ఎన్నికల కమిషన్ - అధికారులు తిరస్కరిస్తారు. ఎన్నికలు జరిగితే వారిని పోటీచేయనివ్వరు. కానీ బీజేపీ జాతీయా అధ్యక్షుడు అమిత్ షాకు మాత్రం ఈ నియమాలేవీ వర్తించడం లేదని సహ దరఖాస్తు దారు - ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
2007లో రాజ్యసభ సీటు కోసం అమిత్ షా అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ ఆఫిడవిట్ లో అహ్మదాబాద్ లోని అమిత్ షాకు ఉన్న రెండు స్థిరాస్తులను చూపించలేదు. ఆ రెండు ఆస్తులతో అమిత్ సా పేరు మీద బ్యాంకులో తనఖా పెట్టి 25 కోట్ల రూపాయల రుణం పొందినట్టు తెలిసింది. ఇంత పక్కా ఆధారాలు లభ్యమైనా అమిత్ షాపై అనర్హత వేటు వేయడానికి అధికారులు జంకుతుండడం ఆయన అధికార దర్పానికి నిదర్శనంగా చెప్పవచ్చు..
ఇక ఆయన అబ్బాయి జైషా కూడా చట్టాలను పట్టించుకోవడం లేదు. జై షా కంపెనీ రెండేళ్లుగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ లో తన లవాదేవీలపై నివేదికలు సమర్పించలేదని తెలిసింది. వేరే సంస్థ అయితే ఐటీ - ఈడీ లాంటి సంస్థలు రంగంలోకి దిగి భారీ జరిమానాలు.. చర్యలు తీసుకునేవి. కానీ అమిత్ షా కొడుకు కావడంతో ఇలా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. చట్టం అధికార పార్టీకి చుట్టం అంటే ఇదేనేమో..