Begin typing your search above and press return to search.

టీజేఎస్‌ కు 11 సీట్లు..కానీ కాంగ్రెస్ మార్క్ ట్విస్ట్‌

By:  Tupaki Desk   |   6 Nov 2018 4:53 PM GMT
టీజేఎస్‌ కు 11 సీట్లు..కానీ కాంగ్రెస్ మార్క్ ట్విస్ట్‌
X
మ‌హాకూట‌మిలో సీట్ల పంప‌కం ఎట్ట‌కేల‌కు ఓ కొలిక్కివ‌చ్చింది. టీజేఎస్ పార్టీకి 11 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకారం తెలిపినట్లు స‌మాచారం. అయితే, కాంగ్రెస్ త‌నదైన శైలిలో ట్విస్ట్ ఇచ్చింది. ఆ స్థానాల్లో స్నేహపూర్వక పోటీ ఉంటుందంటూ మెలిక పెట్టినట్టు సమాచారం. ఇలాంటి స్నేహపూర్వక పోటీకి ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమనీ టీజేఎస్‌ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇక..కాంగ్రెస్ ప్రతిపాదించిన సీట్లలో ఎస్సీ - ఎస్టీ - బీసీలకు కేటాయించే సీట్లపై జనసమితి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. ముఖ్యంగా నల్గొండ -మహబూబ్‌ నగర్ - ఖమ్మం - రంగారెడ్డిలో సీట్లు లేకపోవడంపై టీజేఎస్ నేతలు అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.కాగా రామగుండం నుంచి కోదండరామ్ పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

టీఆర్ ఎస్‌ ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ - టీడీపీ - టీజేఎస్ - సీపీఐ కలిసి మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ 95 స్థానాల్లో పోటీ చేయనుండగా - టీడీపీ 14 స్థానాల్లో పోటీ చేయనుందని సమాచారం. ఇక సీపీఐకి కేవలం మూడు స్థానాలు మాత్రమే కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో రెండు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని కాంగ్రెస్ వారికి హామీ ఇచ్చిందని సమాచారం. ఈ నెల 8న లేదా 9న మహాకూటమి అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని స‌మాచారం.

టీజేఎస్‌కు కేటాయించిన స్థానాలు

1 మెదక్ జనార్దన్‌ రెడ్డి
2 దుబ్బాక రాజ్‌ కుమార్
3 మల్కాజ్‌ గిరి దిలీప్‌ కుమార్
4 వరంగల్ ఈస్ట్ గాదె ఇన్నయ్య
5 సిద్ధిపేట భవానీ రెడ్డి
6 చాంద్రాయణగుట్ట జబరుద్దీన్
7 మిర్యాలగూడ
8 రామగుండం
9 ఆసిఫాబాద్
10 చెన్నూరు
11 వర్ధన్నపేట