Begin typing your search above and press return to search.
కేటీఆర్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న కాంగ్రెస్
By: Tupaki Desk | 8 May 2022 10:00 PM ISTతెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా సాగిన మాటల యుద్ధం ఇప్పుడు కాంగ్రెస్ - టీఆర్ఎస్ అన్నట్లుగా మారిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ తెలంగాణలో రెండు రోజుల పర్యటన ఈ హీట్ ను మరింత పెంచింది. రాహుల్ టూర్ ముగిసిపోయినప్పటికీ ఇంకా ఆ కామెంట్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ 'ఆస్క్ కేటీఆర్' అనే కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ఇందుకు స్పందించిన కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ సెటైర్లు వేశారు.
రాజకీయ అంశాలతో పాటుగా నగరంలో అభివృద్ధి, వివిధ సమస్యలు, విద్యావిధానం, ఎన్నికల్లో మిస్సింగ్ ఓట్లు సహా అనేక అంశాల గురించి నెటిజన్లు కేటీఆర్ ని ప్రశ్నలు అడిగారు. అందరికీ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సమాధానాలు ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలతో పాటు..చాలా పార్టీలు మాకు పోటీలో ఉన్నాయి. రాహుల్ గాంధీ మొదట అమేథీలో గెలవడం పై దృష్టి పెట్టాలని చురకలు వేశారు. అయితే, ఇదే సమయంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ పలు ప్రశ్నలు సంధించారు. ఆస్తులు పెంచుకోడానికి రహస్యమేంటో కేటీఆర్ రాష్ట్ర యువతకు చెప్పాలని వ్యంగంగా కామెంట్ చేశారు.
మంత్రి కేటీఆర్ ఆస్తులకు సంబంధించిన వివరాలను పోస్ట్ చేసిన కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జి 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేటీఆర్ సమర్పించిన అఫిడవిట్ లో తనకు రూ.7 కోట్ల ఆస్తులున్నాయని పేర్కొన్నారని... 2018 వచ్చే వరకు కేటీఆర్ ఆస్తులు రూ.41 కోట్లకు పెరిగాయని ఠాగూర్ తెలిపారు. 2018 నుంచి 2023 వరకు టార్గెట్ ఎంత అంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు. దీంతో ఆస్క్ కేటీఆర్ ఎపిసోడ్‌లో కూడా సామాన్యుల కామెంట్ల కంటే రాజకీయ నేతల విమర్శలకే ప్రాధాన్యం దక్కిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.