Begin typing your search above and press return to search.
ఈసారి కొడంగల్ లో..రేవంత్ రెడ్డి మరో భూ ఆక్రమణ
By: Tupaki Desk | 17 March 2020 3:40 PM ISTభూ ఆక్రమణలకు పాల్పడ్డారని మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటుండగా అతడికి సంబంధించిన మరికొన్ని అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ శివారు గోపన్‌పల్లి భూ ఆక్రమణలు మరువకముందే మరో భూ ఆక్రమణ బహిర్గతమైంది. తాజాగా తన పాత నియోజకవర్గం కొడంగల్ లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
వికారాబాద్ జిల్లా కొడంగల్ శివారులోని సర్వే నంబర్ 1138లో రెండున్నర ఎకరాల భూమిలో రెండస్తుల భవనాన్ని రేవంత్ రెడ్డి నిర్మించుకున్నారు. అయితే ఆ భవనం శిఖం భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా 3,927 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టారని అధికారులు గుర్తించారు. ఇది నేరం కింద పరిగణిస్తున్నారు. వాస్తవంగా అసలు శిఖం భూములను పట్టాలు చేయడానికి వీలులేదని చట్టంలో నిబంధనలతో పాటు హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ నిబంధనలు ఉల్లంఘించి కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి ఇల్లు కట్టేసుకుని.. దాన్ని పట్టాను తన సోదరుడు తిరుపతిరెడ్డి పేరుకి బదలాయించారు. దీన్ని గుర్తించి అధికారులు త్వరలోనే రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
శిఖం భూమిని ఇంటిపట్టాగా మార్చకూడదనే హైకోర్టు ఆదేశాలు ఉన్నా ఎంపీ రేవంత్‌రెడ్డి పట్టించుకోలేదు. ఈ శిఖం భూముల్లో ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి అధికారులను కోరాడు. అయితే అధికారులు ఆ దరఖాస్తును తిరస్కరించారు. అధికారులు అనుమతి ఇవ్వకపోయినా అన్ని రూల్స్‌ను బ్రేక్ చేసి భవనం అక్రమంగా కట్టేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులతో పాటు టీఆర్ఎస్ నాయకులు కోరుతున్నారు. దీనిపై త్వరలోనే అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. దీనిపై చర్యలు చేపడితే ఇక రేవంత్ రెడ్డి చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఇప్పటికే డ్రోన్ తో ప్రైవేటు భవనం చిత్రీకరణ కేసులో రేవంత్ రెడ్డి జైలు లో ఉన్నారు. ఈ సమయంలో ఈ ఆక్రమణ వెలుగులోకి రావడం తో భవిష్యత్ లో రేవంత్ రెడ్డి మెడకు ఇవన్నీ చుట్టుకునే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ కుట్ర పూరితంగా చేస్తున్న ఆరోపణలన్నీ, ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా ఇలాంటివి వెలుగులోకి తెస్తుందని కాంగ్రెస్ నాయకులతో పాటు రేవంత్ రెడ్డి అనుచరులు పేర్కొంటున్నారు. రేవంత్ రెడ్డిని తొక్కేసేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లు మండి పడుతున్నారు.