Begin typing your search above and press return to search.
మోదీతో కోమటిరెడ్డి భేటీ..పాలిటిక్స్ ప్రస్తావన లేదంట!
By: Tupaki Desk | 17 March 2020 10:26 PM ISTకాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ సీనియర్ నేత - భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గానే మారిపోయింది. ఎందుకంటే... కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి చేరిపోతారని అప్పుడెప్పుడో పెద్ద పుకారే వచ్చింది కదా. అయితే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి చేరలేదు. తాజాగా వెంకటరెడ్డి ప్రధానితో భేటీ కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుతం టీ కాంగ్రెస్ లోని పరిస్థితిపై తనదైన శైలి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వెంకటరెడ్డి... మోదీతో భేటీ అయిన నేపథ్యంలో ఆయన ఏమైనా బీజేపీలో చేరిపోతారా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు వెలువడ్డాయి.
అయితే మోదీతో భేటీలో వెంకటరెడ్డి ఎలాంటి రాజకీయ అంశాలను ప్రస్తావించలేదట. ఈ భేటీ సాంతం నో పాలిటిక్స్... ఓన్లీ డెవలప్ మెంట్ అన్న దిశగానే సాగిందట. ఈ విషయాన్ని కోమటిరెడ్డే స్వయంగా వెల్లడించారు. మోదీతో భేటీ తర్వాత ప్రధాని నివాసం నుంచి బయటకు వచ్చిన కోమటిరెడ్డి... మోదీతో తానేం మాట్లాడానన్న విషయాన్ని అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులకు చెప్పేశారు. తానేమీ పాలిటిక్స్ పై చర్చించేందుకు మోదీతో భేటీ కాలేదని - తన నియోజకవర్గంతో పాటు తెలంగాణకు చెందిన పలు అభివృద్ధి అంశాలను ప్రస్తావించేందుకే మోదీతో భేటీ అయ్యానని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.
అయినా మోదీతో కోమటిరెడ్డి ఏఏ అంశాలను ప్రస్తావించారన్న విషయానికి వస్తే... హైదరాబాద్ లో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మాసిటీకి పర్యావరణ అనుమతులు నిలిపివేయాలని, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొత్తగూడెం వరకు జాతీయ రహదారిగా చేయాలని - మూసీ నది ప్రక్షాళన కోసం రూ.3000 కోట్లు కేటాయించాలని - భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలని ప్రధానిని కోమటిరెడ్డి కోరారట.