Begin typing your search above and press return to search.
10 కోట్లిస్తే ఆ ఎమ్మెల్యే ఏమైనా చేసేస్తారట..
By: Tupaki Desk | 6 Jun 2016 4:13 PM ISTరాజ్యసభ సభ్యుల ఎన్నికలు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా రసకందాయంగా మారాయి. ఏపీలో టిక్కెట్ల కేటాయింపులకు ముందు రాజకీయాలు జోరుగా సాగినా ఆ తరువాత పోటీ లేకుండా ఏకగ్రీవంగా - ఏకపక్షంగా ముగిశాయి. కానీ.. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో మాత్రం మంచి రంజుగా సాగుతున్నాయి. ముఖ్యంగా అక్కడి అధికార కాంగ్రెస్ పార్టీ ఓట్ల వేటలో సాగించిన అక్రమ వ్యవహారాలు వీడియోల్లో చిక్కినా కూడా ఇంకా కింద పడినా నాదే పైచేయి అన్నట్లుగా కాంగ్రెస్ పెద్దలు కథలు నడిపిస్తున్నారు. దీంతో కర్ణాటక రాజ్యసభ ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతూ కన్నడ సస్పెన్సు థ్రిల్లర్ సినిమాలను తలపిస్తున్నాయి. రూ. 10 కోట్లు లంచంగా ఇస్తే క్రాస్ ఓటింగ్ చేస్తామంటూ బేరాలు సాగించి స్టింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోయిన ఎమ్మెల్యేలతోపాటు మొత్తం 14 మంది స్వతంత్ర శాసనసభ్యులు సోమవారం అండర్ గ్రౌండులోకి వెళ్లిపోయారు. వారందరినీ ముంబయిలోని రహస్య ప్రాంతంలో దాచినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు అక్కడి పాలక కాంగ్రెస్ పార్టీ మాత్రం స్టింగ్ ఆపరేషనంతా బూటకమంటూ బీరాలు పలుకుతోంది. షెడ్యూల్ ప్రకారమే కర్ణాటకలో ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. స్టింగ్ వ్యవహారం బయటకొచ్చిన తరువాత కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు వాయిదా వేయాలని అక్కడి ప్రతిపక్ష జేడీఎస్ ఎన్నికల సంఘానికి లేఖ రాసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ అవసరం లేదంటూ ఈసీపై ఒత్తిడి పెంచుతోంది. అది చాలదన్నట్లుగా అడ్డంగా బుక్కయిన ఎమ్మెల్యేలను కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి - సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్ వెనకేసుకొస్తున్నారు. ఆ వీడియోలన్నీ బూటకమని.. అందులో ఎలాంటి ఆధారాలు లేవని బుకాయిస్తూ ఎన్నికల సంఘాన్ని కలిసి చెప్పారాయన.
అయితే... అదనపు స్థానం గెలుచుకోవడంలో కీలకంగా మారిన 14 మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ముంబైకి తరలించినట్లుగా చెబుతున్నారు. వారందరి వద్ద సెల్ ఫోన్లు కూడా అందుబాటులో లేకుండా రహస్య ప్రదేశంలో దాచి ఉంచారని జేడీఎస్ ఆరోపిస్తోంది. 225 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ కు 123 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. జేడీఎస్ కు 40 మంది ఎమ్మెల్యేలున్నారు. మెజారిటీని బట్టి కాంగ్రెస్ కు రెండు రాజ్యసభ సీట్లు గెలుచుకోవడం ఖాయం. మూడో స్థానంలో గెలుపు కోసం 12 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం, అదే జేడీఎస్ ఒక స్థానాన్ని గెలుచుకోవాలంటే ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో రెండు పార్టీలూ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలపై కన్నేశాయి. ఆ క్రమంలో పాలక కాంగ్రెస్ వారిని ప్రలోభాలకు గురిచేసి భారీ ఆఫర్లు ఇచ్చింది. స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా భారీ డిమాండ్లు చేశారు. ఆ వ్యవహారమంతా స్టింగు ఆపరేషన్లో బట్టబయలవడంతో ఎన్నికలు వాయిదావేయాలని జేడీఎస్ కోరింది. కానీ... కాంగ్రెస్ ఆ అవసరం లేదంటూ తన రాజకీయాన్ని చూపిస్తోంది. ఇప్పటికే తాయిలాలతో తమ వైపు తిప్పుకున్న స్వతంత్ర ఎమ్మెల్యేలను రాష్ట్రం దాటించేసింది. మరి వారిలో ఎందరు మాటకు కట్టుబడి కాంగ్రెస్ కు ఓటేస్తారో.. లేదంటే జేడీఎస్ నుంచి ఇంకా మంచి ఆఫర్లు వస్తే అటు మొగ్గుతారో చూడాలి.