Begin typing your search above and press return to search.

'చేయి' జారుతున్న ఎమ్మెల్యేలు

By:  Tupaki Desk   |   19 Jan 2019 8:36 AM GMT
చేయి జారుతున్న ఎమ్మెల్యేలు
X
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తన సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతోంది. ఎమ్మెల్యేలు చేజారకుండా వారడిగిన గొంతెమ్మె కోరికలన్నింటీని తీరుస్తుంది. అయినా ఏదో ఒక భయం ఆ పార్టీని వెంటాడుతోంది. ఎంత చేసినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేజారకుండా ఉంటారనే నమ్మకం ఆ పార్టీ నేతల్లోనే కనబడటం లేదు.

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వ మనుగడకు ప్రస్తుతానికి వచ్చిన ఇబ్బంది ఏమిలేదు. అయితే కాంగ్రెస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు చేజారడంతో మళ్లీ రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఎర వేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలతో కొనేందుకు సిద్ధపడుతుంది కాంగ్రెస్ నేత సిద్ధ రామయ్య ఆరోపిస్తున్నారు.

కాంగ్రెస్ కూడా తమ ఎమ్మెల్సేలను కాపాడుకునేందుకు వారు అడిగిన కోరికలన్నింటినీ తీరుస్తోంది. ఎమ్మెల్యేలను సంతృప్తి పరచడానికి శయశక్తులా ప్రయత్నిస్తోంది. దీంతో కాంగ్రెస్ బలహీనతను అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సేలు రకరకాల డిమాండ్లు చేస్తున్నారని సమాచారం.

కాగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులు ఎమ్మెల్యేలను గుప్పిట్లో ఉంచుకోగలదని చర్చ నడుస్తోంది.. ఇప్పటికే ఇండిపెండెంట్లు చేజారిపోయారు. తాజాగా సీఎల్పీ మీటింగ్ కు నలుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. అయితే తమకు చెప్పే అబ్సెంట్ అయ్యారని సిద్ధరామయ్య చెబుతున్నారు. కాగా ఆ నలుగురు ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు వర్గం కావడం విశేషం. దీంతో ఆ ఎమ్మెల్యేలు ఎప్పుడైనా పార్టీ వీడే అవకాశాలే ఉన్నాయి.

ఎంతసేపని ఎమ్మెల్యేలను రిసార్టులు - హోటళ్లలో క్యాంపులు పెట్టుకొని కాపాడుకుంటారు? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నిరోజులని అసంతృప్త ఎమ్మెల్యేలకు కాపాలా ఉంటారు.. ఏదో ఒక సమయం వచ్చిందంటే వారు పార్టీ వీడటం ఖాయం. ప్రస్తుతానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకున్నప్పటికీ బీజేపీ ఆపరేషన్ ఇంకా కొనసాగేలా కనిపిస్తుంది. ప్రస్తుతానికి కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వానికి వచ్చినా ఢోకా ఏమిలేకున్నా కర్ణాటక రాజకీయాలకు ఇప్పట్లో శుభంకార్డు పడేట్లు కనిపించడం లేదు.