Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ను కాంగ్రెస్‌ లో చేర్పిస్తా

By:  Tupaki Desk   |   23 Dec 2018 4:11 PM GMT
కేసీఆర్‌ ను కాంగ్రెస్‌ లో చేర్పిస్తా
X
కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ - ఎమ్మెల్యే నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మునుగోడు నియోజకవర్గ కార్యకర్తల కృతజ్ఞత సమావేశానికి హాజరైన రాజ‌గోపాల్ రెడ్డి ఈ సంద‌ర్భంగా త‌న‌పై జ‌రుగుతున్న ప్ర‌చారానికి చెక్ పెట్టారు. ఇదే స‌మ‌యంలో క‌ల‌క‌లం రేపే కామెంట్లు చేశారు. మునుగోడు నుండి ఎమ్యెల్యే గా గెలిచానంటే అది ప్రజకూటమి కార్యకర్తల గెలుపు అని పేర్కొంటూ త‌న‌ గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని పేర్కొన్నారు. మునుగోడు నియోజకవర్గం త‌న తల్లి లాంటిదని పేర్కొంటూ ఫ్లోరైడ్ సమస్య - సాగునీరు - త్రాగునీరు సమస్యలతో ఎంతో వెనుకబడి ఉంద‌న్నారు. ఎమ్మెల్సీగా మూడేళ్లు ఉన్నా ప్రజల కోసమే ఎమ్యెల్యేగా పోటీ చేశాన‌ని రాజ‌గోపాల్ రెడ్డి అన్నారు.

త‌న‌పై టీఆర్ ఎస్ వాళ్ళు ద్రుష్పచారం చేస్తున్నార‌ని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ``న‌న్ను కలవాలంటే హైద‌రాబాద్ వెళ్లాల్సిందే అంటున్నారు. నా కోసం మీరు రావొద్దు - నేను మీకోసం మీ దగ్గరకే వస్తాను. మీ ఇంటి మనిషి లాగా - కుటుంబ సభ్యులలాగా ఉంటాను. మేము రాజశేఖర్ రెడ్డి అభిమానులం - మాట తప్పము - మడమ తిప్పము. టీఆర్ ఎస్‌ లోకి వెళ్తున్నానని దుష్ప్రచారం చేస్తున్నారు...అవసరమైతే కేసీఆర్‌ ను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేపిస్తాను కానీ చేతి గుర్తును వదిలేది లేదు.`` అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ వదిలిపెట్టి పారిపోయే పిరికిపందలం కాదని ఆయ‌న వ్యాఖ్యానించారు.

తెలంగాణలో టీఆర్ ఎస్ ప్రభుత్వం ఉన్నా - మునుగోడులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంద‌ని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వెల్ల‌డించారు. ``నేనున్నా మీకోసం - తప్పకుండా మనకు మంచిరోజులు వస్తాయి. ఏదో ఒక మాయ జరిగింది - మోసం జరిగింది.అధికారం అడ్డం పెట్టుకుని టీఆర్ ఎస్ వ్యవహరించింది. ఈ భూమి - ఆకాశం ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీ కి చావు లేదు. భూములు కోల్పోయిన నిర్వాసితులకు 10 లక్షలు ఇప్పిస్తాను. మునుగోడు నియోజకవర్గంలో ప్రాజెక్టులు పూర్తి చేపిస్తాం. మాకు ఇచ్చిన మాట నిలబెట్టకపోతే - అసెంబ్లీలో నిలదీస్తాం. మిషన్ భగీరథ పనులు వేగవంతం చేసేవిదంగా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తా. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పెరు మీద - ఆరు మండలాలలో ఆరు అంబులెన్స్‌ లను ఏర్పాటు చేస్తా. మునుగోడు వాగు నుండి ఆన్ లైన్ విదానం ద్వారా ఇసుకు తీసుకెళ్లడం వల్ల భూగర్భ జలాలు ఎండి పోతున్నాయి..ఇసుక తరలించకుండా చూస్తాను. కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని బాధ పడొద్దు...రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి - నల్గొండ ఎంపీ సీట్లు గెలుచుకుంటాం`` అని ప్ర‌క‌టించారు.