Begin typing your search above and press return to search.
జగ్గారెడ్డి ఎఫెక్ట్: కాంగ్రెస్ నేతలకు నోటీసులు
By: Tupaki Desk | 21 Nov 2022 8:00 AM ISTకాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ అధికార ప్రతినిధులపై టీపీసీసీ చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే ఆయా అధికార ప్రతినిధులకు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నిర్వహిస్తున్న సమావేశాలకు డుమ్మా కొడుతున్న అధికార ప్రతినిధులను పీసీసీ వివరణ కోరింది. కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి కారణాలు ఏమిటని ప్రశ్నిస్తూ.. నోటీసులు ఇచ్చింది.
పీసీసీ ఈ మేరకు ఆయా అధికార ప్రతినిధులకు వాట్సప్ ద్వారా నోటీసులు పంపింది. పార్టీ కార్యక్రమాలకు, సమావేశాలకు హాజరు కాని అధికార ప్రతినిధులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియచేయాలని స్పష్టం చేసింది. పీసీసీ నిర్వహిస్తున్న సమావేశాలను తేలికగా తీసుకోవడం వల్ల అటు నాయకులు కాని.. ఇటు పీసీసీ కార్యవర్గ సభ్యులు కాని, అధికార ప్రతినిధులు కాని గైర్హాజరవుతున్నారని తెలిపింది.
జగ్గారెడ్డి ఏమన్నారంటే..
తాజాగా నిర్వహించిన ఓ సమావేశంలో ప్రజలు విపక్ష హోదా ఇచ్చిన దృష్ట్యా ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పోరాటాలు చేయాలి.. ప్రజలకు వద్దకు పార్టీ వెళ్లాలని జగ్గారెడ్డి సూచించారు. వారానికోసారి పీసీసీ సమావేశం అన్నారు.. కానీ ఆ ఊసే లేదని తప్పుపట్టారు. అంతేకాదు.. అంతర్గత సమావేశాలకు కూడా నాయకులు డుమ్మా కొడుతున్నారని అన్నారు. పీసీసీలో నేతలను సమన్వయం చేయాల్సిన మహేశ్ కుమార్ గౌడ్ విఫలమయ్యారని మండిపడ్డారు. జూం సమావేశానికి మహేశ్ కుమార్ గౌడ్ తనను ఆహ్వానిస్తే ఆగ్రహం వ్యక్తం చేశానని, కరోనా తగ్గిపోయినా ఇంకా జూం మీటింగ్ ఏంటి..? అని సూటిగా ప్రశ్నించారు.
ఏమైనా పార్టీకి నష్టం జరిగితే ఆయనదే పూర్తి బాధ్యత అని తేల్చి చెప్పారు. ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తప్పు కూడా ఉందని.. అతనిదీ 100 శాతం తప్పేనని తప్పుపట్టారు. ఇంట్లో కూర్చుని జూం మీటింగ్ వృథా.. కూర్చుని గంటల తరబడి చర్చించే ఎన్నో అంశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఆయా అంశాలపై క్షుణ్ణంగా ఏఐసీసీ, అధిష్ఠానానికి లేఖ రాస్తున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నోటీసుల పర్వం తెరమీదికి వచ్చింది.