Begin typing your search above and press return to search.

మ‌న‌సొక చోట‌.. మ‌నిషొక చోట‌.. జ‌గ్గ‌న్న స్ట‌యిలే వేరు!

By:  Tupaki Desk   |   19 May 2022 5:30 PM GMT
మ‌న‌సొక చోట‌.. మ‌నిషొక చోట‌.. జ‌గ్గ‌న్న స్ట‌యిలే వేరు!
X
పొరుగింటి పుల్ల‌కూర రుచి అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.. తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కుడు.. సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి. ఉండేది.. ప‌ద‌వులు అనుభ‌వించేది.. ఏమైనా సంపాయిస్తే.. ఆస్తులు పోగేసుకునేది.. కాంగ్రెస్ చె ట్టు కింద‌.. కానీ.. పొగిడేది.. భ‌జ‌న చేసేది.. మాత్రం పొరుగు పార్టీనే! అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తు న్నారు. కాం గ్రెస్‌లో అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం ఉన్న‌ప్ప‌టికీ.. మ‌రీ ఇంతా? అనే స్ట‌యిల్లోజ‌గ్గారెడ్డి రెచ్చిపో తున్నారు.

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ప‌ద‌విని ఆశించిన ఆయ‌న అది ద‌క్క‌క పోవ‌డంతో.. తిన్నింటి వాసాల‌నే లెక్క‌పెడుతు న్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పీసీసీ అధ్య‌క్ష‌డు.. రేవంత్ రెడ్డిని విమ‌ర్శించ‌డం.. కాంగ్రెస్ పార్టీలో క‌ల‌క‌లం రేప‌డం.. జ‌గ్గారెడ్డికి ఇటీవ‌ల కాలంలో అల‌వాటుగా మారింది. మ‌రీ ముఖ్యంగా అధికార పార్టీని అడుగ‌డుగునా పొగ‌డ్త‌ల‌తో ముంచెత్త‌డం కూడా ఇటీవ‌ల జ‌గ్గారెడ్డికి ష‌రా మామూలే అన్న‌ట్టుగా మారిపోయింది. తాజాగా ఇప్పుడు జగ్గారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

తన నియోజ కవర్గానికి మెడికల్‌ కాలేజీని మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌ను పొగడక తప్పదని, దాన్ని తప్పుగా అనుకోవద్దని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మెడికల్‌ కాలేజీ భవన నిర్మాణ పనులను బుధవారం జగ్గారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ``సంగారెడ్డికి నేను ఎమ్మెల్యేను. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేను. అలా అని నేను ఎందుకు చెబుతున్నానంటే.. ఎమ్మెల్యేకు కొంత బాధ్యత ఉంటుంది. పార్టీ అంటే పోరాటం. ఎమ్మెల్యే అంటే ఆరాటం`` అని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటే ఓ రకంగా ఉంటుంద‌న్నారు. ప్రభుత్వం లేకుంటే రిక్వెస్ట్‌ చేసి పనులు చేసుకోవాల్సి వస్తుందన్నారు. ఎమ్మెల్యే బాధ్యతాయుత పదవి కావడంతో స్థానిక ప్రజల డిమాండ్ ను నెరవేర్చాల్సిన బాధ్యత త‌న‌పై ఉంద‌న్నారు. దీనికోసం సంగారెడ్డి మెడికల్‌ కాలేజీ ఆవశ్యకతను అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించాన‌ని చెప్పారు. కాలేజీ పనులను వెంటనే పూర్తి చేసి సీఎం చేతుల మీద ప్రారంభించాలని మంత్రి హరీశ్‌ను కోరానన్నారు. ఈ క్ర‌మంలోనే మెడిక‌ల్ కాలేజీని కేటాయించిన‌సీఎం
కేసీఆర్‌ను పొగ‌డ‌కుండా ఉండ‌లేక పోతున్నాన‌ని చెప్పారు.

మ‌రి.. పార్టీ కోసం.. పార్టీని అధికారంలోకితెచ్చేందుకు.. పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కానీ.. ఇత‌ర నేత‌లు కానీ.. కృషి చేస్తున్నారు క‌దా.. మ‌రి వారికి థ్యాంక్స్ చెప్ప‌వా.. జ‌గ్గ‌న్నా? ! అనేది ఇప్పుడు తెర‌మీదికి వ‌చ్చిన ప్ర‌శ్న‌. మ‌రి దీనికి జ‌గ్గ‌న్న ఏమంటారో.. చూడాలి. త‌న‌కు పొరుగింటి పుల్ల‌కూరే రుచి అంటారేమో!!