Begin typing your search above and press return to search.

రాజీనామా చేసే ద‌మ్ముందా.. జ‌గ్గ‌న్నా?!

By:  Tupaki Desk   |   21 March 2022 4:30 AM GMT
రాజీనామా చేసే ద‌మ్ముందా.. జ‌గ్గ‌న్నా?!
X
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డిని చూస్తే `అంత‌న్నాడింత‌న్నాడే.. గంగ‌రాజు` అనే పాట గుర్తుకు వ‌స్తోంద ట రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు!! పౌరుషానికి ఏమీ త‌క్కువ‌లేదు. పార్టీని ఇరుకున పెట్ట‌డంలో పోటీకి అంత‌క‌న్నా త‌క్కువ‌లేదు. పార్టీకి మేలు చేయ‌రా.. మొగుడా అంటే.. ఉన్న పెంకులు తీసేస్తా! అన్న‌ట్టుగా ఉంద‌ట జ‌గ్గ‌న్న ప‌రిస్థితి! ఈ మాట ప్ర‌జ‌లే అంటున్నారు. ఇక‌, కాంగ్రెస్‌లో త‌ట‌స్థ వాదుల ప‌రిస్థితి చెప్పేదేముంది? వారైతే.. మ‌రింత‌గా వాపోతున్నారు. ``ఏదైనా పార్టీకి మేలు చేసే ప‌నిచేయాలి. కానీ, ఇలా పార్టీ ప‌రువు తీస్తానంటే ఎలా? వారు స‌ణుగుతున్నారు.

ఇంత‌కీ విష‌యంలోకి వెళ్తే..అతి పెద్ద అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తుల‌కు.. స్వ‌పక్షంలోనే విప‌క్ష నేత‌ల‌కు.. కొద‌వ లేదు. అయితే.. ఇప్పుడు ఇలాంటి వారిలో తానే ముందున్నానంటున్నారు ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి. `లేచానంటే.. నా అంత‌వాడు లేడు..` అంటారాయ‌న‌.

కానీ, లేచేదెప్పుడో మాత్రం ఎవ‌రికీ చెప్ప‌రు. అంతేకాదు.. ఆయ‌న‌కే తెలియ‌ద‌మో!! అంటున్నారు ప్ర‌జ‌లు. రాష్ట్రంలో ఆయ‌న సీనియ‌ర్‌. ఈ విష‌యం కాదనేది ఏముంది. కానీ, కోరుకున్న ప‌ద‌వి.. పీసీసీ చీఫ్ ద‌క్క‌లేదు. ఇది కూడా ఎవ‌రిచేతిలోనూ లేదు. అంతా అధిష్టానం ఇష్టం. అధిష్టానానికి న‌చ్చిన‌వారికి.. అధిష్టానం మెచ్చిన వారికే ప‌ద‌వులు క‌దా!!

ఈ విధంగానే తెలంగాణ‌లోనూ జ‌రిగింది. యువ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ , ఎంపీ రేవంత్‌రెడ్డికి అధిష్టానం పీసీసీ ప‌ద‌వి ఇచ్చింది. అయితే.. ఎక్క‌డో ఏదో పార్టీ నుంచి వ‌చ్చిన రేవంత్‌కుఇవ్వ‌డం ఏంట‌నేది.. జ‌గ్గ‌న్న మాట‌. పోనీ.. మీరే ట్రై చేసుకోవ‌చ్చుక‌దా! అంటే.. ఆయ‌న ఏమీ చెప్ప‌లేని ప‌రిస్థితి. కాదు కాదు.. అధిష్టానం వ‌ద్ద `అంత సీన్‌` లేని ప‌రిస్థితి!! అంటున్నారు ప్ర‌జ‌లు. దీంతో ఎప్ప‌టిక‌ప్పుడు కాలు కాలిన పిల్లిలా.. నిప్పు తొక్కిన కోతిలా కొంత హ‌ల్చ‌ల్ చేస్తున్నారు. దీనివ‌ల్ల‌.. పార్టీకే న‌ష్టం జ‌రుగుతోంద‌న్న విష‌యం జ‌గ్గ‌న్న గుర్తు పెట్టుకోవాల‌ని.. ఆయ‌న‌ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లే మొత్తుకుంటున్నారు.

కొన్ని రోజుల కింద‌ట ఇటీవ‌ల‌.. జ‌గ్గ‌న్న చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు.. అధిష్టానానికి లేఖ రాశాను.. పార్టీ మారిపోతాను అన్నారు. అయితే.. ఇంత‌లోనే సీనియ‌ర్ నేత వీ. హ‌నుమంత‌రావు.. స్వ‌యంగా ఆయ‌న ఇంటికి వెళ్లారు. మ‌రి ఏం జ‌రిగిందో ఏమో.. అదుగో హ‌నుమంత‌న్న కాద‌న్నాడు కాబ‌ట్టి ఉంటున్నా.. అన్న‌డు. కానీ, ఇంత‌లోనే.. మ‌ళ్లీ ఫైర్‌!! ఏకంగా పీసీసీ చీఫ్ రేవంత్‌పై మ‌ళ్లీ నిప్పులు క‌క్కేశారు.. జ‌గ్గ‌న్న‌. రాజీనామా చేస్తాను.. అని మ‌ళ్లీ పాడిన పాటే పాడ‌డం ప్రారంభించారు. ఇలా చెప్పిచెప్పి.. అసిపోతున్నారా? అని ప్ర‌శ్నిస్తున్నారు ప్ర‌జ‌లు.

మమ్మల్ని సస్పెండ్ చేసే దమ్ము ఎవరికీ లేదన్నారు. తనను సస్పెండ్ చేసినా కాంగ్రెస్‌కు, సోనియా, రాహుల్‌కు విధేయుడుగా ఉంటానని, రేవంత్ ఛాలెంజ్ చేస్తే తాను రాజీనామ చేస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తన నియోకవర్గంలో అభ్యర్థిని నిలబెట్టి గెలిపిస్తే రేవంత్ హీరో అని ఒప్పుకుంటానని అన్నారు.

తాను గెలిస్తే హీరోనని, ఇద్దరం ఓడితే జీరోలమేనన్నారు. తనను సస్పెండ్ చేస్తే, రోజుకో బండారం బయట పెడుతానన్నారు. రేవంత్ పార్టీ లైన్‌లో పని చేయడం లేదని, పర్సనల్ షో చేస్తున్నారని, అందుకే తాను కూడా పర్సనల్ షో చేస్తున్నానన్నారు. తన కూమార్తె సమస్యపై వీహెచ్ మంత్రి హరీష్ రావును కలిస్తే తప్పేంటని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

మొత్తంగా గ‌త‌, తాజా వివాదాలు చూస్తే.. పిట్ట పిట్ట పోరు.. పిల్లికి క‌లిసి వ‌చ్చింద‌న్న‌ట్టుగా ఉంద‌ని ప్ర‌జ‌లు న‌వ్వుకుంటున్నారు. రాజీనామారాజీనామా అంటూ.. అలిసిపోయావా.. లేక మ‌ళ్లీ వీహెచ్ వ‌చ్చాడు.. ఆగాను అని క‌త‌లు చెపుతావా? అని ప్ర‌శ్నిస్తున్నారు.

కేసీఆర్‌ని ఎదుర్కొన‌లేక‌.. రేవంత్‌ను టార్గెట్ చేస్తే ఏం వ‌స్తుంది జ‌గ్గ‌న్నా! అని ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు. పీసీసీ ప‌ద‌వి రేవంత్‌కు ద‌క్కిదంటే.. దానికి కార‌ణం సోనియా.. మ‌రీ ఆమె మీకు ఎందుకు ఇవ్వ‌లేదో.. మీరే ఆలోచించుకోవాలి. అని అంటున్నారు. మ‌రి జ‌గ్గ‌న్న ఏం చెబుతారో చూద్దాం.