Begin typing your search above and press return to search.

జ‌గ్గారెడ్డి ట్విస్ట్‌...అబ్బే ఇప్పుడ‌ప్పుడే కాంగ్రెస్‌ను వీడ‌ను

By:  Tupaki Desk   |   20 Feb 2022 6:34 AM GMT
జ‌గ్గారెడ్డి ట్విస్ట్‌...అబ్బే ఇప్పుడ‌ప్పుడే కాంగ్రెస్‌ను వీడ‌ను
X
తనపై టీఆర్ఎస్‌ కోవర్ట్ అంటూ ముద్రవేస్తున్నార‌ని, ఈ స‌మ‌యంలో పార్టీ నాయకులు కనీసం ఖండించలేదని, అలాంటప్పుడు పార్టీ తనను వదిలించుకుంటేనే మంచిదని పేర్కొంటూ...కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు శనివారం ప్రకటించిన జగ్గారెడ్డి కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఆ నిర్ణ‌యాన్ని మార్చుకున్నారు.

పార్టీకి గుడ్ బై చెప్పేయాల‌నే నిర్ణయాన్ని `కొంతకాలం` వాయిదా వేస్తున్నట్లు జ‌గ్గారెడ్డి ట్విస్ట్ ఇచ్చారు. త‌న ఆలోచ‌న వెనుక ఆస‌క్తిక‌ర కార‌ణాలను సైతం జ‌గ్గారెడ్డి పంచుకున్నారు.

పార్టీలో ఓ వైపు త‌న‌కు పొగ‌పెడుతుండ‌టం, మ‌రోవైపు సీనియ‌ర్లు సైతం అండ‌గా లేక‌పోవ‌డం త‌న‌ను బాధిస్తుంటూ కాంగ్రెస్‌ను వీడుతున్న‌ట్లు జగ్గారెడ్డి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి, సీనియర్ నేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు. అయితే, ఈ అప్‌డేట్ త‌ర్వాత ప‌రిణామాలు వేగంగా మారాయి.

జగ్గారెడ్డి ప్రకటన వెలువడగానే.. కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు జగ్గారెడ్డి ఇంటికి వెళ్లి కలిశారు. ఏవైనా సమస్యలుంటే మాట్లాడి పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాపై చ‌ర్చించేందుకు జగ్గారెడ్డితో భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత జగ్గారెడ్డి తన నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

త‌న నిర్ణ‌యంపై జ‌గ్గారెడ్డి స్పందిస్తూ...శ‌నివారం నుంచి జరుగుతున్న పరిణామాలు ఎవరిమీదో బురద జల్లాలని కాదని వివ‌రించారు.`` పెద్దల సలహా మేరకు.. పదిరోజులు పార్టీ వీడటం అంశాన్ని పక్కకు పెడుతున్నాను.

ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని కలవాలని ఉత్తమ్ సూచించారు. వారం, పదిరోజుల తర్వాత అందరం కలిసి మాట్లాడుదామని సూచించారు. పదిహేను రోజులు మీడియాకు దూరంగా ఉండాలని, తొందర పడొద్దని పెద్దలు సూచించారు. పదిహేను రోజుల తర్వాతైనా అదే నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. పార్టీ వీడటం ప్రస్తుతానికి వాయిదా మాత్రమే. ఢిల్లీ వెళ్ళివచ్చాక నా నిర్ణయం ప్రకటిస్తా. ' అని జగ్గారెడ్డి వివ‌రించారు.