Begin typing your search above and press return to search.
ఓటమికి సాకులు చెబుతున్న కాంగ్రెస్
By: Tupaki Desk | 11 Nov 2020 3:20 PM ISTఎన్నికల ఫలితాలు వచ్చేసిన తర్వాత ఓటమిని హుందాగా అంగీకరించే పార్టీలు, అభ్యర్ధులు చాలా తక్కువమందే ఉంటారు. ఇపుడిదంతా ఎందుకంటే మధ్యప్రదేశ్ లో జరిగిన 28 అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా 19 చోట్ల గెలిచింది. మిగిలిన స్ధానాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు గెలిచారు. నిజానికి ఇపుడు ఉపఎన్నికలు జరిగాయంటే అది కాంగ్రెస్ పార్టీ చేతకాని తనం వల్లే అని చెప్పుకోవాలి. ఎందుకంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత జ్యోతిరాధిత్య సింథియా తిరుగుబాటు చేయటంతో సమస్యలు మొదలయ్యాయి.
సింథియా నేతృత్వంలో మొదలైన తిరుగుబాటు చివరకు 25 మంది మద్దతుదారులైన ఎంఎల్ఏలతో బయటకు వెళ్ళిపోవటంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. తర్వాత జరిగిన పరిణామాల కారణంగా సింథియా మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యింది. ఆ తర్వాత రాజకీయ సంచలనాల కారణంగా సింథియా వెంట వెళ్ళిపోయిన ఎంఎల్ఏలపై స్పీకర్ అనర్హత వేటు వేయటంతో వాళ్ళంతా మాజీలైపోయారు. అప్పటికే బీజేపీలోని ముగ్గురు ఎంఎల్ఏలు మరణించటంతో మొత్తం 28 స్ధానాలకు తాజాగా ఉపఎన్నికలు జరిగాయి.
ఫలితాలు వచ్చేసిన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ ఈవిఎంలను మ్యానేజ్ చేయటం వల్లే బీజేపీ గెలిచిందంటు చేసిన ఆరోపణలు విచిత్రంగా ఉన్నాయి. ఈవీఎంల మాయాజాలం వల్లే బీజేపీ గెలిచింది కానీ ప్రజలు ఓట్లేయటంతో కాదంటు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఈవిఎంల్లోని చిప్ ద్వారా ఎలాంటి మిషన్ను అయినా మ్యానేజ్ చేయవచ్చని డిగ్గీరాజా చెప్పటం కాస్త విడ్డూరంగానే ఉంది.
బీజేపీ గెలిచిన 19 సీట్లలో ఈవిఎంలను మ్యానేజ్ చేసిందనే అనుకుందాం. కాంగ్రెస్ అభ్యర్ధులు కూడా 9 చోట్ల గెలిచారు కదా . మరి గెలిచిన కాంగ్రెస్ అభ్యర్ధులు ఎలా గెలిచారు. 19 చోట్ల ఈవిఎంలను మ్యానేజ్ చేసుకోగలిగిన బీజేపీ మిగిలిన 9 స్ధానాలను ఎందుకు వదిలేసినట్లు ? ఎన్నికలు అయిపోయిన తర్వాత బ్యాలెట్ ఆధారంగానే ఎన్నికలు జరిగుండాలని చెప్పటంలో అర్ధమేంటో మూడుసార్లు సీఎంగా పనిచేసిన డిగ్గీరాజాకే తెలియాలి.