Begin typing your search above and press return to search.

రేవంత్, భట్టి కి షాక్.. కాంగ్రెస్ కంచు కోటకు బీటలు

By:  Tupaki Desk   |   25 Jan 2020 3:28 PM IST
రేవంత్, భట్టి కి షాక్.. కాంగ్రెస్ కంచు కోటకు బీటలు
X
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటలకు బీటలు వారాయి. కారు జోరుకు కాంగ్రెస్ కుదేలైంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు షాకిచ్చాయి.

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కొడంగల్ నియోజకవర్గం కంచుకోట. ఆయన రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. ఈసారి కూడా మొత్తం ప్రచారం అక్కడే చేశారు. అలాంటి చోట కాంగ్రెస్ కు చేదు ఫలితాలు వచ్చాయి. కొడంగల్ మున్సిపాలిటీ లో టీఆర్ఎస్ హవా కొనసాగింది. మొత్తం 12 వార్డుల్లో టీఆర్ఎస్ 7 స్థానాలు గెలుపొందగా.. కాంగ్రెస్ కేవలం 3 స్థానాలకు పరిమితమైంది. టీఆర్ఎస్ కు కనీస పోటీ ఇవ్వలేక పోయిన రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు తీవ్ర నిరాశకు గురిచేశాయి.

ఇక కాంగ్రెస్ మరో కంచుకోట అయిన టీపీసీసీ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మథిర కోటకు కూడా బీటలు పడ్డాయి. మథిర మున్సిపాలిటీలో అధికార టీఆర్ఎస్ విజయం దిశగా దూసుకెళ్తుండడం భట్టికి షాక్ లా మారింది. మధ్యాహ్నం వరకూ అందిన సమాచారం ప్రకారం మొత్తం 8వార్డుల్లో 5 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించగా.. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ కూటమి కలిసి పోటీ చేసి కేవలం 1 సీటు మాత్రమే గెలుచుకోవడం గమనార్హం. దగ్గరుండి మరీ ప్రచారం చేసిన మల్లు భట్టికి ఈ ఫలితాలు కోలుకో లేని దెబ్బగా పరిణమించాయి.