Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ వాదుల్లో నిరాశ.. బీజేపీ వైపు చూస్తున్నారా?

By:  Tupaki Desk   |   21 Nov 2020 9:14 AM IST
కాంగ్రెస్ వాదుల్లో నిరాశ.. బీజేపీ వైపు చూస్తున్నారా?
X
దుబ్బాకలో విజయం బీజేపీపై ఆశలు పెంచింది. అదే చోట కాంగ్రెస్ మూడోస్థానానికి పడిపోవడం ఆ పార్టీ నేతల్లో ఆశ చచ్చేలా చేస్తోంది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ లోని నిరాశవాదులంతా భవిష్యత్ కోసం బీజేపీ బాట పడుతున్నారు.

వైఎస్ఆర్ హయాంలో వెలుగు వెలిగిన వారంతా ప్రస్తుతం రాజకీయంగా స్తబ్దుగా ఉన్నారు. వారంతా యాక్టివ్ కావాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్రమాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సైతం మనసు మార్చుకున్నారు. త్వరలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

ఇవాళ తన ఇంటికి వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, గడ్డం వివేక్ లు కలిసి కోరడంతో సర్వే సత్యనారాయణ మనసు మార్చుకున్నారు. బీజేపీలో చేరాలని డిసైడ్ అయ్యారు.

బండి సంజయ్ ఆహ్వానం మేరకు తనతోపాటు చాలామందిని బీజేపీలో చేరుస్తానని సర్వే సత్యానారాయణ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కు ఇది పెద్ద షాక్ గా చెప్పవచ్చు. అంటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా బీజేపీలో చేరనున్నట్టు సమాచారం.

కాంగ్రెస్ ను నడిపించే వ్యక్తి లేకపోవడం.. వరుస ఓటములు, కుంగుబాట్ల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలంతా ఇప్పుడు భవిష్యత్ కోసం బీజేపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.