Begin typing your search above and press return to search.

స‌భ సాక్షిగా కేసీఆర్‌ కు జీవ‌న్ రెడ్డి పంచ్‌

By:  Tupaki Desk   |   16 April 2017 10:10 AM GMT
స‌భ సాక్షిగా కేసీఆర్‌ కు జీవ‌న్ రెడ్డి పంచ్‌
X
అస‌లే ఫైర్ బ్రాండ్‌. అలాంటి వ్య‌క్తితో వాదులాట‌కు దిగటం మాట‌లా? తాజాగా అలాంటి సాహ‌సమే చేశారు తెలంగాణ‌కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత జీవ‌న్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలోని ముస్లింల‌కు.. ఎస్టీల‌కు ప్ర‌త్యేక రిజ‌ర్వేష‌న్ ఇచ్చేందుకు వీలుగా ప్ర‌త్యేక తెలంగాణ అసెంబ్లీ.. శాస‌న మండ‌లి ఈ రోజు ప్ర‌త్యేకంగా స‌మావేశాన్ని ఏర్పాటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అనుకున్న‌ట్లే షెడ్యూల్ ప్ర‌కారం మొదలైన తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు.. వాడీవేడిగా సాగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా త‌న వాద‌న‌ను భావోద్వేగంతో వినిపించిన సీఎం కేసీఆర్‌.. ప‌నిలో ప‌నిగా విప‌క్షాల‌పై వేయాల్సిన పంచ్ లు వేసేశారు. ముస్లిం రిజ‌ర్వేష‌న్ల సాధ‌న‌లో భాగంగా తాము చేయాల‌నుకుంటున్న వివ‌రాల్ని సీఎం కేసీఆర్ వివ‌రించ‌గా.. దానికి కౌంట‌ర్ గా జీవ‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఒక ద‌శ‌లో జీవ‌న్ రెడ్డి మాట‌ల‌కు ఇరుకున ప‌డినట్లుగా క‌నిపించారు కేసీఆర్. ఈ కార‌ణంతోనే కాబోలు.. జీవ‌న్ రెడ్డి మాట్లాడే క్ర‌మంలో మ‌ధ్య‌లో క‌ల్పించుకున్న కేసీఆర్‌.. ఆయ‌న్ను తీవ్రంగా త‌ప్పు ప‌ట్ట‌ట‌మే కాదు.. స‌భ‌ను ప‌క్క‌దారి ప‌ట్టించే ప‌ని చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు.

దీనికి బ‌దులిచ్చే క్ర‌మంలో జీవ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. త‌మిళ‌నాడు త‌ర‌హాలో రాజ్యాంంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌ లో ఈ బిల్లును చేర్చేలా ప్ర‌య‌త్నం చేయాల‌ని.. దానికి కేంద్రం స‌హ‌క‌రిస్తుందా? అని ప్ర‌శ్నించారు. దీనికి స్పందించిన కేసీఆర్‌.. ఈ బిల్లును కేంద్రం తొమ్మిదో షెడ్యూల్ లో చేరుస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌న్నారు. ఒక‌వేళ కేంద్రం స‌హ‌క‌రించ‌క‌పోయినా సుప్రీంకోర్టుకు వెళ్లి.. ఈ రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేస్తామ‌న్నారు. జీవ‌న్ రెడ్డి లాయ‌ర్ అని.. అలాంటి ఆయ‌న ఈ త‌ర‌హా విమ‌ర్శ‌లు చేయ‌టం స‌రికాద‌న్నారు.

దీనికి బదులిస్తే క్ర‌మంలో జీవ‌న్ రెడ్డి చెప్పిన మాట‌.. తెలంగాణ అధికార‌ప‌క్షానికి ఇబ్బందిని క‌లిగించ‌ట‌మే కాదు.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నోటి నుంచి స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితిని క‌ల్పించారు. ఇంటింటికి మంచినీటిని స‌ర‌ఫ‌రా చేయ‌ని ప‌క్షంలో రానున్న ఎన్నిక‌ల్లో మ‌హిళ‌ల్నిఓట్లు అడ‌గ‌న‌ని.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పార‌ని.. అదే రీతిలో తాజాగా చేస్తున్న ముస్లిం రిజ‌ర్వేష‌న్ల మీద కూడా కేసీఆర్ అదే క‌మిట్ మెంట్ తో వ్య‌వ‌హ‌రిస్తారా? అని సూటిగా ప్ర‌శ్నించారు. దీనిపై వెంట‌నే బ‌దులివ్వ‌ని కేసీఆర్‌.. త‌ర్వాత మాత్రం జీవ‌న్ రెడ్డికి చుర‌క‌లు వేస్తూ మాట్లాడారు.

కోడిగుడ్డు మీద ఈక‌లు పీకిన చందంగా జీవ‌న్ రెడ్డి మాట‌లు ఉన్నాయ‌ని.. త‌మ బిల్లును తొమ్మిదో షెడ్యూల్‌ లో చేర్చ‌ని ప‌క్షంలో సుప్రీంకోర్టును ఆశ్ర‌యించి సాధిస్తామ‌న్నారు. త‌న‌కు రిజ‌ర్వేష‌న్లు సాధిస్తాన‌న్న ఆత్మ‌విశ్వాసం ఉంద‌ని చెప్పుకొచ్చారు. గ‌తంలో ఏ మాట‌తో అయితే.. ప్ర‌తిప‌క్ష స‌భ్యుల నోటికి కేసీఆర్‌ తాళాలు వేశారో.. ఇప్పుడు అదే మాట‌ను తిరిగి కేసీఆర్ మీద‌కు వ‌దిలిసిన జీవ‌న్ రెడ్డి మాట‌లు కేసీఆర్ కు ఇబ్బంది క‌లిగించాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/