Begin typing your search above and press return to search.
సీఎం గారు మీరు కూడా అలానే చేస్తే ఎలా ..ఇంతకీ సీఎం ఏం చేశాడంటే!
By: Tupaki Desk | 5 Sept 2020 2:00 PM ISTదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దేశంలో రోజురోజుకి నమోదు అయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కొత్త రికార్డ్స్ ను సృష్టిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40 లక్షలు దాటిపోయింది. సామాన్యుల నుండి ప్రజాప్రతినిధులు , ప్రముఖులు కూడా కరోనా భారిన పడ్డారు. దేశంలో పలువురు సీఎంలు కూడా కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కి కూడా పాజిటివ్ అని తేలింది. అయితే ఆయనకు ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో ప్రస్తుతం హోంఐసోలేషన్‌లో ఉంటూ ముఖ్యమంత్రిగా తన విధులు నిర్వర్తిస్తున్నారు.
ఈ నేపథ్యంలో .. తనకు కరోనా సోకిందని.. అయినా రాష్ట్రానికి సీఎంగా సేవలు అందించాల్సిన బాధ్యత తన మీద ఉందని స్వయంగా చెప్పుకొచ్చారు. ఈ మేరకు ప్రమోద్ సావంత్ తన విధులకు సంబంధించి కొన్ని ఫోటోలను శుక్రవారం విడుదల చేశారు. ఆ ఫోటోలో రాష్ట్రానికి సంబంధించిన కొన్నొ ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేసినట్లుగా కనిపిస్తుంది. అయితే ప్రమోద్ సావంత్ తీరుపై ప్రతిపక్షం కాంగ్రెస్ విమర్శలు కురిపించింది. సీఎం తన చేతులకు గ్లౌజ్ వేసుకోకుండానే ఫైళ్లపై సంతకాలు ఎలా చేస్తారని విమర్శించింది.
ఈ ఘటన పై గోవా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిరీష్ చోదంకర్ ట్విటర్ లో స్పందిస్తూ..' కరోనా సోకినా ప్రమోద్ సావంత్ విధులు నిర్వర్తించడం బాగానే ఉంది.. కానీ , చేతికి కనీసం గ్లౌజ్ వేసుకొని సంతకాలు చేస్తే బాగుండేది. ఆయన సంతకం చేసిన ఫైళ్లను అధికారులు, ఇతర సిబ్బంది ముట్టుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారికి కరోనా సోకదని గ్యారంటీ ఏంటి.. ప్రమోద్ సావంత్ ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ సీఎం పై విమర్శలు కురిపించారు.