Begin typing your search above and press return to search.
తన చేతి ఫోటోను కేంద్రమంత్రికి ట్వీట్ చేసిన మధు యాష్కీ
By: Tupaki Desk | 5 Oct 2020 12:00 PM ISTమాజీ ఎంపీ.. కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ తాజాగా తన చేతి ఫోటోను కేంద్రమంత్రికి ట్వీట్ చేసిన వైనం షాకింగ్ గా మారింది. చేతి భాగం పొక్కిపోయిన వైనాన్ని ఆయన ఫోటో తీశారు. ఇంతకూ జరిగిందేమంటే.. విదేశాల నుంచి భారత్ కు వస్తున్న ప్రయాణికుల చేతుల మీద క్వారంటైన్ ముద్ర వేస్తున్నారు. ఇటీవల విదేశాల నుంచి తిరిగి వచ్చిన మధు యాష్కీ చేతి మీదా ఢిల్లీ ఎయిర్ పోర్టులో ముద్ర వేశారు.
ఈ స్టాంప్ వేసిన తర్వాత.. చేయి పొక్కిపోయింది. ఎంతకూ మార్పు లేని తన చేతి ఫోటోను తాజాగా ట్విట్టర్ లో కేంద్రమంత్రికి ట్వీట్ చేశారు. ‘ప్రియమైన హర్ దీప్ సింగ్ పురి గారు.. ఫారిన్ నుంచి వస్తున్న ప్రయాణికుల చేతులపై ఢిల్లీ ఎయిర్ పోర్టులో వేస్తున్న స్టాంపులకు వినియోగిస్తున్న రసాయనం ఏమిటో చూడండి’’ అంటూ కొత్త సమస్యను తెర మీదకు తీసుకొచ్చారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో తన చేతికి వేసిన స్టాంపుతో తన చేతులు ఎలా మారిపోయాయో ఆయన అర్థమయ్యేలా పోస్టు చేశారు.
కొత్త సమస్యను తన వరకు తీసుకొచ్చిన మధు యాష్కీని కేంద్రమంత్రి అభినందించారు. స్టాంపుల్లో వినియోగిస్తున్న రసాయనం ఏమిటో వెంటనే తనకు తెలియజేయాలని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా సీఎండీకి కేంద్రమంత్రి సూచన చేశారు. మధు యాష్కీ ట్వీట్ తో రానున్న రోజుల్లో మరెంత మంది స్టాంపు బాధితులు తెర మీదకు వస్తారో చూడాలి.