Begin typing your search above and press return to search.
ఆ రెండు పాదాలు... . మోడీని ఢీ కొట్టే శక్తిని రాహుల్ కి ఇస్తాయా...?
By: Tupaki Desk | 4 Sept 2022 4:25 PM ISTదేశంలో కాంగ్రెస్ పాలన మళ్ళీ రావాలని జనాలు కోరుకుంటున్నారా. అసలు బీజేపీ పాలన మీద జనాభిప్రాయం ఎలా ఉంది. సర్వేలు పేరిట వస్తున్నవి అన్నీ నిజమేనా. దేశంలో మోడీకి ఎదురు లేదా. ఆయనని ఢీ కొట్టే నేత వర్తమాన దేశ రాజకీయాల్లో ఎవరూ కనిపించడంలేదా
ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు బహుశా మరి కొద్ది రోజులలో తెలిసే అవకాశం ఉంది. ఈ నెల 7 నుంచి రాహుల్ గాంధీ దేశవ్యాప్త పాదయాత్రను చేపడుతున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా సాగే ఈ యాత్ర ఏకంగా 150 రోజుల పాటు ఉంటుంది. రాహుల్ పది రాష్ట్రాలు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను టచ్ చేస్తూ 3,500 కిలోమీటర్ల మేర పాదయాత్రను సాగిస్తారు.
ఒక విధంగా చెప్పాలంటే దేశంలో పాదయాత్రలు ఒక కీలక రాజకీయ నాయకుడు చేసి చాలా దశాబ్దాలు అయింది. మాజీ ప్రధాని చంద్రశేఖర్ 1980 ప్రాంతాలలో ఇలాంటి పాదయాత్రను చేశారు. ఆయన కూడా కాశ్మీరు నుంచి కన్యాకుమారి దాకానే రూట్ పెట్టుకుని చేశారు. అయితే ఆయన ఒక బలమైన పార్టీకి నాయకుడు కాకపోవడం వల్ల ఆ పాదయాత్ర ఎఫెక్ట్ ఏమీ చూపించలేదు.
ఇక ఆ తరువాత ప్రధాన రాజకీయాల్లో ఉన్న అగ్ర నాయకులు ఎవరూ పాదయాత్రల జోలికి దేశంలో పోలేదు. రాష్ట్రాలలో అయితే చాలా మందీ ఈ రోజుకీ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు నాట ఆ ట్రెండ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. ఇక బీజేపీ తరఫున అద్వానీ రెండు విడతలుగా రధయాత్ర చేశారు. ఆ పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఆయన తరువాత అదే పార్టీకి చెందిన సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ పాదయాత్ర చేశారు.
ఇక పాదయాత్రలు రధయాత్రలు అంటే గాంధీ వంశానికి దూరమే అని చెప్పాలి. ఇపుడు అయిదవ తరం నాయకుడు రాహుల్ గాంధీ ఈ అరుదైన ఫీట్ ని చేయబోతున్నారు. దీని వల్ల రాహుల్ చాలా ప్రయోజనాలు ఆశిస్తున్నారు. మొదటిగా తనను తాను తెలుసుకోవడం, జనాలతో మమేకం కావడం, వారి నుంచి నేర్చుకోవడం, ఈ దేశంలో సామాన్యుడి గొంతుక ఏమి చెబుతోంది అని దగ్గరగా వినడం.
అదే విధంగా తనను తాను మాస్ నాయకుడిగా అదే జనం సాయంతో తీర్చిదిద్దుకోవడం. ఇక ఈ దేశంలో బీజేపీ తప్ప మరో పార్టీకి చోటు లేదు అంటూ వస్తున్న సర్వేలలో నిజమెంత ఉందో కూడా తెలుసుకోవడం. అసలైన తీర్పరులుగా ఉన్న ప్రజల బాధ ఏమిటి, వారు ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు అన్నది స్వయంగా వినడం.
ఇక కాంగ్రెస్ కి ఎక్కడ బలం ఉంది. ఎక్కడ లేదు అన్నది తేల్చుకోవడం, ఆ దిశగా రిపేర్లు చేసేందుకు ఉపక్రమించడం. అలాగే ఈ దేశంలో కేవలం అధికారంలో ఉన్న బీజేపీ మాత్రమే ఏకైక పార్టీ కాదని, జనాల కోసం కాంగ్రెస్ ఉందని గుర్తు చేయడం, వారిని గట్టి భరోసా ఇవ్వడం. అలాగే కాంగ్రెస్ కార్యకర్తలకు పూర్తి స్థాయిలో మనో నిబ్బరం ఇవ్వడం, ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు సైతం ఖాతరు చేయకుండా ఉన్న నేపధ్యంలో కాంగ్రెస్ సత్తా వారికి కూడా తెలియచేసి విపక్ష శిబిరానికి అసలు సిసలు పెద్దన్న తానే అని గట్టిగా చెప్పుకోవడం.
ఇలా అనేక అంశాలతో అనేక రాజకీయ లక్ష్యాలతో అనేక రకాలైన ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునే పనిలో రాహుల్ గాంధీ జనం బాట పడుతున్నారు. ఈ మొత్తం పన్నెండు రాష్ట్రాలలో ఒకటి రెండు తప్ప అన్నీ కూడా విపక్షాలు ఉన్న రాష్ట్రాలే. అంటే రాహుల్ చేయబోతున్న పాదయాత్ర ద్వారా ఆయన గారి ఏమి పోగొట్టుకుందో దాన్ని వెనక్కితెచ్చుకోవడం కూడా జరగాలని తాపత్రయపడుతోంది అన్న మాట.
మొత్తానికి రాహుల్ గాంధీకి రాజకీయంగా పట్టు లేదని, సీరియస్ పొలిటీషియన్ కాడని, ఆయనలో మాస్ అప్పీల్ లేదని, ఆయనను మోడీకి ధీటైన నేతగా జనాలు గుర్తించడంలేదని చాలా రకాలుగా విమర్శలు ఉన్నాయి. వాటికి గట్టి జవాబు చెప్పడానికే రాహుల్ తన రెండు పాదాలకు పని చెప్పబోతున్నారు. ఆ రెండు పాదాలే నిండు బలాలుగా మార్చుకుని 2024 ఎన్నికల్లో మోడీకి ధీటైన నేతగా నిలబడడానికి రాహుల్ చేస్తున్న ఈ పాదయాత్ర గ్రాండ్ సక్సెస్ అవుతుందని కాంగ్రెస్ ఆశిస్తోంది.
ఇక పౌర సమాజం, దేశంలో పెరుగుతున్న అసహనంతో పాటు ప్రజాస్వామ్యానికి వాటిల్లుతున్న ముప్పుని గుర్తిస్తున్న మేధావి గణం, ప్రముఖులు, వివిధ వర్గాల వారు అంతా రాహుల్ పాదయాత్రకు మద్దతుగా నిలవడం కీలకమైన పరిణామం. ఒకనాడు యూపీయే అవినీతిని భరించలేమంటూ బీజేపీ చుట్టూ చేరిన సెక్షన్లు ఇపుడు రాహుల్ వైపుగా ర్యాలీ అవుతున్నాయి. దాంతో కాంగ్రెస్ కి ఎక్కడ లేని ధైర్యం వస్తోందిట.
తాజాగా వస్తున్న వివిధ సర్వేలు కాంగ్రెస్ కి ఈసారి వంద నుంది 150 దాకా సీట్లు రావచ్చు అని చెబుతున్నాయి. రాహుల్ పాదయాత్ర పూర్తి అయితే కచ్చితంగా 200 పై దాటి ఎంపీ సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అదే జరిగితే రేపటి ప్రధానిగా రాహులే ఉంటారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.