Begin typing your search above and press return to search.

అమితాబ్‌ - అక్ష‌య్‌.. ఆ ధైర్యం ఇప్పుడేమైంది? సూటిగా ప‌్ర‌శ్నించిన కాంగ్రెస్ నేత‌!

By:  Tupaki Desk   |   18 Feb 2021 8:00 PM IST
అమితాబ్‌ - అక్ష‌య్‌.. ఆ ధైర్యం ఇప్పుడేమైంది? సూటిగా ప‌్ర‌శ్నించిన కాంగ్రెస్ నేత‌!
X
యూపీఏ హ‌యాంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ట్వీట్ల పేరుతో విమ‌ర్శ‌లు గుప్పించిన బాలీవుడ్ హీరోలు ఇప్పుడు ఎందుకు నోరు మెద‌ప‌ట్లేద‌ని ప్ర‌శ్నించారు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా ప‌టోల్‌. నాటి కేంద్రంపై ఇష్టమొచ్చిన‌ట్టు ఆరోప‌ణ‌లు చేసిన‌వారు.. ఇప్పుడు పెట్రోల్ వంద రూపాయ‌లు అవుతున్నా.. ఎందుకు నోరు మూసుకుంటున్నార‌ని నిల‌దీశారు.

ప్రస్తుతం దేశంలో ఇంధన ధరలు చుక్కలను తాకుతున్నా.. ఎందుకు స్పందించ‌ట్లేద‌ని అమితాబ్, అక్షయ్ కుమార్ ను సూటిగా ప్ర‌శ్నించారు ప‌టోల్‌. మన్మోహన్ హయాంలో ఇంధన ధరలపై అమితాబ్, అక్షయ్‌లు ట్వీట్‌లు చేసేవారని.. కానీ, నేడు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడ‌ట్లేద‌ని, ఆ ధైర్యం ఇప్పుడు ఏమైంద‌ని నానా పటోల్ విమర్శించారు.

రాష్ట్రంలో పన్నులతో కలుపుకుని మహారాష్ట్రలో కొన్ని చోట్ల పెట్రోల్ ధరలు రూ.100 దాటాయని చెప్పారు. ఇంత జ‌రుగుతున్నా చూస్తూ ఊరుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. ఇకనుంచి మహారాష్ట్రలో అమితాబ్, అక్షయ్ కుమార్ చిత్రాల షూటింగ్‌లను జ‌ర‌గ‌నివ్వ‌బోమ‌ని హెచ్చ‌రించారు.

దీనిపై బీజేపీ నేతలు స్పందించారు. ప్రతిభావంతులైన వ్యక్తులను కాంగ్రెస్‌ బెదిరిస్తోందని అన్నారు. విదేశాల్లో వున్న కొంతమంది భారతదేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని, వారికి కాంగ్రెస్ మద్ధతుగా నిలుస్తోంద‌ని ఆరోపించారు.