Begin typing your search above and press return to search.
లవ్ జిహాద్ పై కాంగ్రెస్ నేత డిగ్గీ సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 30 Oct 2020 6:20 PM ISTలవ్ జిహాద్ పై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలకు ఘాట్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత డిగ్గీ రాజా అలియాస్ దిగ్విజయ్ సింగ్. ఈ సందర్భంగా బీజేపీ అగ్రనేతలు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, షానవాజ్ హుస్సేన్ లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ఓ ముస్లిం యువకుడు హిందూ అమ్మాయిని వివాహం చేసుకుంటే అది లవ్ జిహాద్. మోదీ కేబినెట్ లో మంత్రిగా ఉన్న ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ హిందూ మహిళను వివాహం చేసుకున్నారు. బీజేపీ అగ్రనేత షానవాజ్ హుస్సేన్ కూడా హిందూ మహిళను వివాహం చేసుకున్నారు. ఇది కూడా లవ్ జిహాదేనా?’’ అంటూ దిగ్విజయ్ సంచలన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
బీజేపీ నేతలకు ఎలాంటి అజెండా లేదని.. చర్చించడానికి ఎలాంటి అంశాలు లేవని అందుకే హిందూ ముస్లిం వ్యవహారాన్ని తెరపైకి తెస్తారని దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు.
హిందూ ముస్లిం పేరుతో బీజేపీ నేతలు సమాజంలో విద్వేషాన్ని నింపుతున్నారని కాంగ్రెస్ జాతీయ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ఆయన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నేతలు దీనిపై భగ్గుమన్నారు.