Begin typing your search above and press return to search.

ప‌బ్జీ నిషేధిస్తే యువ‌త ఉద్య‌మిస్తారు.. కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రం

By:  Tupaki Desk   |   28 July 2020 4:20 PM IST
ప‌బ్జీ నిషేధిస్తే యువ‌త ఉద్య‌మిస్తారు.. కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రం
X
చైనాకు సంబంధించిన యాప్‌ల నిషేధం నేప‌థ్యంలో భాగంగా మ‌రికొన్ని యాప్స్ నిషేధించే ప‌నిలో కేంద్ర ప్ర‌భుత్వం ఉం‌ది. ఈ క్ర‌మంలో పబ్జీని నిషేధిస్తార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ వ్యంగ్యంగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి స్పందించి మాట్లాడారు. ఆన్‌లైన్ గేమ్‌ల‌లో సంచ‌ల‌నంగా మారిన పబ్‌జీపై ఆయ‌న ట్విట్ట‌ర్‌లో స్పందించారు. యువత ఈ ఆటను ఆడటం మానేస్తే.. నిరుద్యోగం గురించి గొంతెత్తుతారని అభిషేక్ సింఘ్వీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

‘‘ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ పబ్జీని నిషేధించాలని భావిస్తున్నారు. కానీ.. యువత ఫాంటసీ ప్రపంచంలో లేకపోతే.. వారు వాస్తవ ప్రపంచం గురించి నిలదీస్తారు. నిరుద్యోగిత.. ఇతరత్రా విషయాలు పెద్ద చర్చలై కూర్చుంటాయి’’ అంటూ ట్వీట్ చేశారు. స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్లకు చెందిన 47 యాప్‌లను కేంద్రం సోమవారం నిషేధించింది. నెల రోజుల క్రితమే చైనాకు చెందిన 59 యాప్‌లపై కేంద్ర వేటు వేసిన విష‌యం తెలిసిందే. త్వరలోనే పబ్‌జీతో పాటు మరో 258 యాప్‌లపైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.