Begin typing your search above and press return to search.

రాజయ్యకు ఇంటిపోరును పెట్టిన కాంగ్రెస్

By:  Tupaki Desk   |   13 Nov 2018 9:01 AM GMT
రాజయ్యకు ఇంటిపోరును పెట్టిన కాంగ్రెస్
X
కాంగ్రెస్ తొలి జాబితా విడుదలైంది. దాదాపు 65మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితా చూస్తే ఒక్కటే స్పష్టమవుతోంది. ఆర్థిక అండదండలున్న వారికే టికెట్ల కేటాయింపు జరుగుతోందని అర్థమవుతోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ తమ అర్థ అంగ బలంతో ఏకంగా మూడు సీట్లను చేజిక్కించుకోవడం కాంగ్రెస్ నేతల్లో విస్మయానికి గురిచేసింది. అదిలించి - బెదిరించి తీసుకున్న ఈ సీట్ల వ్యవహారం కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది.

కాగా కాంగ్రెస్ జాబితా మొత్తంచూస్తే బలమైన ఆర్థికబలం ఉన్న వారికే టికెట్లు ఇచ్చారని తేటతెల్లమవుతోంది. వరంగల్ పూర్వపు జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్ ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ ఎమ్మెల్యే రాజయ్య మళ్లీ పోటీలో ఉన్నారు. ఈయనపై నియోజకవర్గంలో తీవ్ర విమర్శలున్నాయి. ఓడిపోతాడనే ప్రచారం కూడా జరుగుతోంది..

ఈ నేపథ్యంలో రాజయ్యపై ఖచ్చితంగా గెలిచేలా కాంగ్రెస్ టికెట్ ను ఆయన బావమరిది భార్య సింగాపురం ఇందిరకు కేటాయించారు. రాజయ్య ఫ్యామిలీ మెంబరే కావడం.. పైగా బాగా ఆర్థిక బలం ఉండడంతో ఈమె రాజయ్యను ఖచ్చితంగా ఓడిస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందుకే ఇక్కడ తీవ్రంగా పోటీపడిన విజయరామారావు - రేవంత్ తోపాటు దొమ్మాటి సాంబయ్యలకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ నిరాకరించింది. వీరు ఆర్థికంగా లేకపోవడం.. పెద్ద ఖర్చు పెట్టే స్తోమత లేకపోవడంతోనే టికెట్ దక్కలేదనే ప్రచారం జరుగుతోంది. ఆర్థికంగా బలవంతురాలైన ఇందిరకు టికెట్ ఇస్తే రాజయ్య ఖచ్చితంగా ఓడిపోతాడని కాంగ్రెస్ నాయకులు అధిష్టానానికి నివేదించారు. దీంతో అందరినీ తోసిరాజని బలమైన ఇందిరకు స్టేషన్ ఘన్ పూర్ సీటును కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసింది.