Begin typing your search above and press return to search.

మునుగోడులో కాంగ్రెస్ ఫైనాన్షియల్ ప్లాన్ బాగా ఉందా?

By:  Tupaki Desk   |   14 Sep 2022 10:30 AM GMT
మునుగోడులో కాంగ్రెస్ ఫైనాన్షియల్ ప్లాన్ బాగా ఉందా?
X
తెలంగాణలో జరగబోయే ఏకైక ఉప ఎన్నిక ఇప్పుడు కాక రేపుతోంది. అధికారంలో ఉండడంతో టీఆర్ఎస్ ఇక్కడ ఏ అభ్యర్థిని పెట్టినా ఆర్థికంగా డబ్బులు కుమ్మరించి గెలిచే సత్తా కలిగి ఉంది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి డబ్బున్న బడాబాబు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నడే ఉన్నాడు. ఇతడికి ఇప్పటికే బోలెడు ఆస్తులున్నాయి. సో ఆర్తికంగా వచ్చిన సమస్య ఏం లేదు. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీలో సర్పంచ్, ఎంపీటీసీలను రూ.5 లక్షలు, పది లక్షల చొప్పున కొనేస్తున్నాయని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఇబ్బంది ఎవరికంటే కేవలం ‘కాంగ్రెస్’కు మాత్రమే.

ఎందుకంటే మునుగోడు కాంగ్రెస్ సీటు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ పై పోటీచేసి గెలిచిన సీటు. అందుకే ఇప్పుడు తమ సీటును తాము దక్కించుకునేందుకు కాంగ్రెస్ సమాయత్తం అవుతోంది. కానీ బాధల్లా ఒక్కటే. రెండు సార్లు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కు ఆర్థిక వనరుల కొరత వేధిస్తోంది. ఇక తాజాగా కాంగ్రెస్ మునుగోడు అభ్యర్థిగా ప్రకటించిన పాల్వాయి స్రవంతి ఆర్థికంగా లేరని.. బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులతో పోలిస్తే ఆమె డబ్బులు ఖర్చు పెట్టరని.. ఎన్నికల్లో ఇది ప్రభావం చూపిస్తుందని కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది.

మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ కాంగ్రెస్ ను కలవరపెడుతోంది. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి పోటీకి దిగారు. ఆయన అన్న కాంగ్రెస్ లోనే ఉండి తమ్ముడికి మద్దతుగా రాజకీయం చేస్తున్నాడన్న ఆరోపణలున్నాయి.

ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ ను పాల్వాయి స్రవంతికి ఇవ్వడంతో రాజకీయం మలుపు తిరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరినట్టే మునుగోడు అభ్యర్థిగా స్రవంతి ఎంపిక చేసింది. ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం ముందు నుంచి కృష్ణారెడ్డి అనే అభ్యర్థిని నిలబెట్టాలని చూశారు. కానీ వెంకటరెడ్డి యేమో స్రవంతిని ప్రతిపాదించారు. దీంతో ఈ సంకుల సమరంలో వెంకటరెడ్డి సూచించిన స్రవంతికే టికెట్ ఇచ్చింది అధిష్టానం.. పీసీసీ చీఫ్ రేవంత్ కు షాక్ ఇచ్చింది.ఇప్పుడు స్రవంతిని గెలిపించే బాధ్యత ఎంపీ కోమటిరెడ్డిపై పడింది.

కాంగ్రెస్ అభ్యర్థి ఆర్థికంగా వీక్ అని హైకమాండ్ కు తెలుసు. అక్కడ వాళ్ల ఫ్యామిలీ గత 40 ఇయర్స్ పాలిటిక్స్ కాబట్టి ఆమెకు సీనియర్లు జైకొట్టారని తెలుస్తోంది. అయితే రేవంత్ రెడ్డి మాత్రం మునుగోడులో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. స్రవంతి దగ్గర డబ్బులు లేవని ఒక మంచి ప్లాన్ చేశాడని తెలిసింది. ప్రతీ క్లస్టర్ కు డబ్బులు ఉన్న వాళ్లను ఇన్ చార్జిలుగా నియమించారు. వాళ్లే అక్కడ డబ్బులు పెట్టి మెజారిటీ ఆ క్లస్టర్ లో తీసుకొని రావాలని..వాళ్లకు వచ్చే ఎన్నికల్లో ఆర్థికంగా ఎలాంటి ప్లాన్ ఉంటుందో అనుభవంలోకి వస్తుందని చెప్పి ప్రోత్సహించాడట.. మునుగోడులో ఖర్చు పెట్టేవారికి సీటు గ్యారెంటీ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ఇలా డబ్బున్న కాంగ్రెస్ నేతలకు మునుగోడులో బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం.

ఇలా టీఆర్ఎస్, బీజేపీ డబ్బులు వెదజల్లుతూ మునుగోడులో ప్రతాపం చూపిస్తుంటే.. కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం ఇతరులపై ఆధారపడి నడిపించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా కొందరు బలమైన డబ్బున్న నేతలకు బాధ్యతలు అప్పగించి మేనేజ్ చేయడానికి రెడీ అయ్యారు. మరి ఈ ప్రయోగం ఫలిస్తుందా? లేదా? అన్నది వేచిచూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.