Begin typing your search above and press return to search.

హోంమంత్రి ఇంటిని ముట్టడించిన కాంగ్రెస్ కార్యకర్తలు..

By:  Tupaki Desk   |   8 Oct 2020 2:00 PM IST
హోంమంత్రి ఇంటిని ముట్టడించిన కాంగ్రెస్ కార్యకర్తలు..
X
తెలంగాణ‌లో మ‌హిళ‌ల ప‌ట్ల జ‌రుగుతున్నఅరాచకాలు, హ‌త్యాచారాల‌పై కాంగ్రెస్ పార్టీ నేడు హోంమంత్రి ఇంటిని ముట్ట‌డించింది. తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ ఆలీ ఇంటి గేట్లు తోసుకుని కాంగ్రెస్ నేతలు, ఇతర సంఘాల నేతలు లోపలి వెళ్లారు. మెయిన్ గేట్ వద్దనున్న సెక్యూర్టీ గార్డ్స్ లు అడ్డుకున్నా. వారిని తోసుకుంటూ లోపలికి వెళ్లిపోయారు. ఆ తర్వాత అక్కడే బైఠాయించి ధర్నా చేపట్టారు.

బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం ఎలాంటి సమాచారం లేకుండా, ఒక్కసారిగా వందలాది మంది కార్యకర్తలు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి క్వార్టర్స్ లోపలకు దూసుకెళ్లారు. అత్యాచారాలు, హత్యలు కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలం అయింది అంటూ నినాదాలు చేశారు.తెలంగాణ రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు పెరుగుతున్నా కట్టడి చేయడం లేదని ఆరోపించారు.

మెయినాబాద్, ఖమ్మంలో జరిగిన ఘటనలను ఉదహరిస్తున్నారు. పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. ఆందోళన చేపడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆందోళ‌న‌లో ఏఐసీసీ కార్య‌ద‌ర్శి సంప‌త్, ఎన్.ఎస్.యూ.ఐ, యూత్ కాంగ్రెస్ నేత‌లు పాల్గొన్నారు. ఈ క్రమంలో హోం మంత్రి ఇంటి వద్ద సెక్యూరిటీని పెంచారు. పెద్దఎత్తున పోలీసు బలగాలు క్వార్టర్స్ దగ్గరికి చేరుకుంటున్నాయి.

ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ఈ ఉదయం భట్టి విక్రమార్క కలిసి ఆరోగ్యం, ఇతర పరిస్థితులు గురించి ఆరా తీశారు. ఆస్తమా, కాలిన గాయాలతో బాధపడుతున్న బాలికకు మెరుగైన వైద్యం అందించేందుకు కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాలని భట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.