Begin typing your search above and press return to search.
చాయ్ వాలాకు 2లక్షల అప్పుపడ్డ ప్రతిపక్షం
By: Tupaki Desk | 22 Dec 2016 10:33 AM ISTవందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓ చాయ్ కొట్టు వ్యాపారికి రూ.2 లక్షలు బాకీ పడటం చర్చనీయాంశమైంది. ముంబైలోని ఆజాద్ మైదాన్ వద్ద ముంబై రీజినల్ కాంగ్రెస్ కమిటీ (ఎంఆర్సీసీ)కి పక్కనే ఇందర్‌జోషి అనే వ్యక్తి కొన్నేళ్లుగా చాయ్ కొట్టు నడుపుతున్నాడు. చాలాకాలంగా కాంగ్రెస్ కార్యాలయానికి చాయ్ ని సరఫరా చేస్తున్నాడు. అయితే నాలుగు నెలలుగా బిల్లు చెల్లించడం లేదని, దాదాపు రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉందని జోషి తెలిపాడు. పలుమార్లు నేతలను కలిసి చెప్పినా సమస్య పరిష్కారం కాలేదు. దాంతో ఉద్దెరపై చాయ్ పంపించడం నిలిపివేశాను అని పేర్కొన్నాడు.
గతంలో కొన్ని నెలలకు ఒక్కసారి చొప్పున కొంత మొత్తాన్ని చెల్లించేవారని, ఈ మధ్యలో చెల్లింపులు పూర్తిగా ఆగిపోయాయని మీడియాకు తెలిపాడు. ఈ వ్యవహారంపై ఎంఆర్సీసీ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ మాట్లాడుతూ.. చాయ్ వాలాకు బాకీ ఉన్న విషయం నిజమేనని, కార్యాలయ ఉద్యోగి చేసిన నిర్వాకం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నదని అన్నారు. మొత్తం రూ.4 లక్షలు చెల్లించాల్సి ఉండగా రూ.2 లక్షలు చెల్లించే విధంగా సర్దుబాటు చేశామని, ఆ మొత్తాన్ని త్వరలో చెల్లిస్తామని అన్నారు. కానీ జాతీయ పార్టీగా ఉంది. అంతా ధనవంతులే ఉన్న ఈ పార్టీలో ఇదేం చిత్రమని మిగతా పార్టీల నాయకులు చర్చించుకుంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/