Begin typing your search above and press return to search.

కాపుల్లో అయోమయం!

By:  Tupaki Desk   |   16 July 2021 5:43 AM GMT
కాపుల్లో అయోమయం!
X
అవును కాపుల్లో అయోమయం పెరిగిపోతోంది. ఇంతకీ కాపులు బీసీలా ? లేకపోతే ఓసీలేనా ? అయోమయం మిగిలిన సామాజికవర్గాల్లో కూడా పెరిగిపోతోంది. ఈ అయోమయానికి ప్రధాన కారణం చంద్రబాబునాయుడు చేసిన పనే. కాపులను బీసీ (ఎప్)లో కేటగిరీలో చేరుస్తు అసెంబ్లీలో తీర్మానం చేయించారు. దాని అమలుకు కేంద్రానికి పంపారు. అయితే కేంద్రం ఆ తీర్మానాన్ని తిప్పికొట్టింది.

ఎందుకంటే రిజర్వేషన్ల అంశం కేంద్రప్రభుత్వం పరిధిలోనిదే కానీ రాష్ట్రాలకు ఏమాత్రం సంబంధంలేదు. ఈ విషయం తెలిసినా కాపులను మోసం చేయటం కోసమే రిజర్వేషన్లు కల్పిస్తు చంద్రబాబు నాటకాలాడారు. అయితే తర్వాత కొంత కాలానికి అగ్రవర్ణాల్లోని పేదలకు కేంద్రం 10 శాతం రిజర్వేషన్ కల్పించింది. దీనిలో కూడా చంద్రబాబు మళ్ళీ డ్రామాలు మొదలుపెట్టారు.

కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయిస్తు జీవో జారీ చేశారు. నిజానికి ఈ జీవో కూడా చెల్లదు. ఎందుకంటే కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్ను యధాతథంగా రాష్ట్రం అమలు చేయాలే కానీ మార్పులు చేయకూడదు. ఒకవేళ మార్పులు చేయాలంటు అందుకు కేంద్రం అనుమతి తప్పనిసరి. అయితే కేంద్రానికి సంబంధం లేకుండానే చంద్రబాబు మార్పుచేసేశారు. అందుకనే జీవోకు వ్యతిరేకంగా చాలామంది కోర్టులో కేసులు వేశారు.

తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు ఓడిపోయినా ఆయన హయాంలో రిలీజ్ చేసిన జీవోలపై కోర్టుల్లో ఇంకా కేసులు అలాగే ఉన్నాయి. ఇదే సమయంలో అసెంబ్లీలో చేసిన తీర్మానాలను కూడా అప్పట్లో టీడీపీ ఉపసంహరించుకోలేదు. దాంతో ఇపుడు కాపులు బీసీలా ? లేకపోతే ఓసీలేనా అనే విషయంలో అయోమయం పెరిగిపోతోంది. ఎందుకంటే చంద్రబాబు హయాంలో కాపులను బీసీల్లో చేరుస్తు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలంటు కాపుసంఘాలు డిమాండ్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది.