Begin typing your search above and press return to search.
మూడు పార్టీలతో జనాల్లో అయోమయమేనా ?
By: Tupaki Desk | 29 Dec 2021 7:00 PM ISTమూడు పార్టీలు కలిసి జనాలను అయోమయంలోకి నెట్టేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని భారతీయ జగన్ పార్టీ అంటూ రెచ్చిపోయారు. అలాగే మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ బేజేపీ నిర్వహించింది ప్రజాగ్రహ సభ కాదని చంద్రబాబు అనుగ్రహ సభ అంటు ఎద్దేవా చేశారు. బహిరంగ సభలో బీజేపీ నేతలు మాట్లాడుతూ వైసీపీ, టీడీపీ రెండు అవినీతి పార్టీలే అంటు మండిపోయారు.
తాము ఏ పార్టీకి బి- టీం కాదంటు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇపుడు బీజేపీలో ప్రముఖంగా కనిపిస్తున్న నేతల్లో సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, ఆదినారాయణరెడ్డి లాంటి అత్యధికులు టీడీపీ మూలాలున్న నేతలే కాబట్టి. హోలు మొత్తం మీద చూస్తే అసలు బీజేపీకి వైసీపీ, టీడీపీల్లో దేనితో సంబంధముంది, ఏ పార్టీకి బీజేపీ బీ టీమ్ అనే విషయంలో జనాల్లో అయోమయం పెరిగిపోతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీ నేతలు చంద్రబాబునాయుడును ఎంతగా టార్గెట్ చేస్తున్నా తమ్ముళ్ళ నుండి పెద్దగా రియాక్షన్ ఉండటంలేదు.
ఇదే సమయంలో బీజేపీ నేతల ఆరోపణలు, విమర్శలపై వైసీపీ నుండి కౌంటర్లు పడుతూనే ఉన్నాయి. కాకపోతే బీజేపీ నేతలను మంత్రులు, వైసీపీ సీనియర్ నేతలు పెద్దగా పట్టించుకోవటంలేదు. చాలా కాలం తర్వాత టీడీపీ సీనియర్ నేత పయ్యావుల మాత్రమే బీజేపీని టార్గెట్ చేస్తు మాట్లాడారు. అదికూడా బీజేపీ నేతలను మాత్రమే టార్గెట్ చేశారు కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ నరేంద్ర మోడీ, అమిత్ షా ను కానీ ఏమీ మాట్లాడలేదు.
ప్రత్యేకహోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు అంగీకరించారనే జనాలు చంద్రబాబును నిలదీయాలని వీర్రాజు చెప్పారు. చంద్రబాబు వల్లే అమరావతి రైతులు రోడ్డున పడ్డారని ఘాటుగా విమర్శించినా తమ్ముళ్ళ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. కాబట్టి టీడీపీ, బీజేపీ ఒకటే అనుకోవాలా ? ఇదే సమయంలో మంత్రులు లోకల్ లీడర్లను టార్గెట్ చేస్తున్నారే కానీ ఏపీ ప్రయోజనాలను దెబ్బ కొడుతున్న మోడీకి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడటం లేదు. అంటే వైసీపీ+బీజేపీ ఒకటే అనుకోవాలా ?
ఇలాంటి అనేక కారణాల వల్ల ఏ రెండు పార్టీలు ఒకటే అనే విషయంలో జనాల్లో అయోమయం పెరిగిపోతోంది. హోలు మొత్తం మీద జనాలకు ఒక విషయంలో మాత్రం క్లారిటీ వచ్చినట్లే ఉంది. అదేమిటంటే ఏపీలో జరగాల్సినంత అభివృద్ధి జరగకపోవటానికి, ఏపీ ప్రయోజనాలను తుంగలో తొక్కేయటంలో మూడు పార్టీల పాత్రా ఉందని. కాకపోతే జనాలు చిన్నగీత ఏది పెద్ద గీత ఏదని మాత్రమే చూస్తున్నారు.