Begin typing your search above and press return to search.
వైసీపీలో మైకు వీరులు గెలవడం కష్టమేనా...?
By: Tupaki Desk | 3 Jan 2022 8:00 AM ISTమైక్ దొరికితే చాలు గటగటమంటూ గంటల తరబడి మాట్లాడే టాలెంట్ వారి సొంతం. ప్రత్యర్ధిని మాటల తూటలతో పేల్చడం ఎలాగో వారికే బాగా తెలుసు. ఇక తమ వాగ్ధాటికి ఎదురులేదని చెప్పుకుంటారు. పదునైన విమర్శలు చేయడమే కాదు, ఒక్కోసారి మాటలతోనే మంటలు పుట్టిస్తారు. నాడు పార్టీ తరఫున అయినా నేడు ప్రభుత్వం వైపున అయినా ఆ త్రిమూర్తులు ఎపుడూ టాప్ లెవెల్ లోనే ఉన్నారు. వారే అంబటి రాంబాబు, ఆర్కే రోజా, జోగి రమేష్. ఈ ముగ్గురూ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేలు. వీరు మీడియా ముందు మాట్లాడడం మొదలుపెడితే ఆ ధారాప్రవాహానికి అంతూ పొంతూ ఉండదంటారు. ఇది విమర్శ అయినా ప్రశంస అయినా వారు హ్యాపీగా తీసుకుంటూనే మీడియాతోనే అంతా అనుకుంటారు.
మరి ఎన్నికలకు సరిగ్గా సమయం సమయం మాత్రమే ఉంది. పెర్ఫార్మెన్స్ వైజ్ గా చూసుకోవాలీ అంటే ఇది కీలకమైన టైమ్. ఈ ముగ్గురూ రెండవ సారి నెగ్గిన వారే. ముందుగా సీనియర్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విషయం తీసుకుంటే ఆయన మూడు దశాబ్దాల తరువాత మళ్లీ అసెంబ్లీ మెట్లు ఎక్కారు. సత్తెనపల్లి నుంచి రెండు సార్లు వరసగా పోటీ చేస్తే 2019లో విజయం సాధించారు. అది కూడా స్పీకర్ కోడెల శివప్రసాదరావు మీద 21 వేల పై చిలుకు మెజారిటీ సాధించారు.
విషయం ఏంటి అంటే ఇపుడు అక్కడే అంబటికి ఎదురు గాలులు గట్టిగా వీస్తున్నాయని టాక్. ఆయనకు సొంత సామాజికవర్గంలోనే వ్యతిరేకత కనిపిస్తోంది అంటున్నారు. అంబటి రాంబాబు తొలిసారి 1989లో రేపల్లె నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నాడు మూడు పదుల వయసులో గెలిచిన తరువాత మూడు సార్లు ఓడి మళ్లీ 2019లోనే నెగ్గారు. ఆయన రేపల్లెని వదలి సత్తెనపల్లెకు రావడం పట్ల సొంత క్యాడరే గుర్రుగా ఉంది.
ఇక్కడ వైసీపీ వర్గాలుగా చీలిపోయింది. దాంతో అంబటి వ్యతిరేకవర్గం ఆ మధ్య బాహాటంగానే హడావుడి చేసింది. ఇక గతంతో పోలిస్తే ఇక్కడ టీడీపీ పుంజుకుంటోంది. టీడీపీ తరఫున కోడెల కుమారుడు పోటీ చేస్తారని చెబుతున్నారు. కోడెల సానుభూతి ఓటు కూడా ఆయనకు కలసి వచ్చే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఈ దఫా అంబటికి టికెట్ ఇస్తే గెలిచేది లేదని కూడా సొంత పార్టీ వారే అంటున్నారుట. ఆయన్ని రేపల్లెకి షిఫ్ట్ చేయాలని అధినాయకత్వం ఆలోచనలు ఉన్నాయని చెబుతున్నారు. మొత్తానికి సత్తెనపల్లి నుంచి మళ్లీ టికెట్ వచ్చినా అంబటి గెలుపు డౌటే అంటున్నారు.
ఇక మరో నేత ఆర్కే రోజా గురించి చూస్తే ఆమె నగరి నుంచి రెండు సార్లు వరసగా గెలిచారు. అయితే ఇపుడు అక్కడ ఆమెకు వ్యతిరేకంగా బలమైన వర్గమే ఉంది. ఆమె మాట చెల్లకుండా ఉండేలా సొంత పార్టీలోనే బలమైన నాయకులు ట్రై చేస్తున్నారు అంటారు. దానికి రోజా స్వయంకృతం కూడా ఉంది అని చెబుతారు. ఆమె హైదరాబాద్ లోనే ఎక్కువ టైమ్ ఉంటూ చుట్టపు చూపుగా నగరి వస్తారని ఆరోపణలు ఉన్నాయి.
బీసీలు ఎక్కువగా ఉన్న ఈ సీట్లో ఈసారి వారికే టికెట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు అన్న మాట ఉంది. మరో వైపు రోజా నగరిలో ఇల్లు కట్టించుకున్నా కూడా కేరాఫ్ అక్కడ కాదు అన్నది జనంలో బలంగా వెళ్ళిపోవడంతో టికెట్ వచ్చినా గెలుపు ఆశలు పెద్దగా ఉండవనే అంటున్నారు. ఆమె మీడియా ముందు బాగా హడావుడి చేసినా నగరిలో మాత్రం ఇపుడు బాగానే టీడీపీ పుంజుకుంది అంటున్నారు. టీడీపీ తరఫున మాజీ మంత్రి ముద్దు క్రిష్ణమ నాయుడు కుమారుడు పోటీ చేస్తారని టాక్. ఆయన ఇప్పటి నుంచే జనాల్లో బాగా తిరుగుతున్నారు. వైసీపీలో వైరి వర్గం అయితే దారికి రాదు, అంత గ్యాప్ వచ్చిన చోట రోజా హ్యాట్రిక్ విజయం అనుమానమే అంటున్నారు.
మరో వైపు చూస్తే జోగి రమేష్ కూడా క్రిష్ణా జిల్లాలో దూకుడు నేతగా ఉన్నారు. వైసీపీ తరఫున ఆయన మైకు ముందు గట్టిగానే సౌండ్ చేస్తారు. పెడన నియోజకవర్గానికి చెందిన ఈ బీసీ నేత దూకుడుకు టీడీపీ బాగానే కళ్లెం వేస్తోంది. ఇక్కడ ఆ పార్టీకి గట్టి నేతలు ఉన్నారు. మరో వైపు చూస్తే 2009 ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున తొలిసారి గెలిచిన జోగి రమేష్ 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున రెండవ మారు ఎమ్మెల్యే అయ్యారు.
ఇక జోగి రమేష్ మళ్లీ ఇక్కడ నుంచి పోటీకి రెడీ అంటున్నారు. అయితే ఆయన దూకుడే ఒక్కోసారి ప్లస్ అయినా అదే పెద్ద మైనస్ అంటున్నారు. మొత్తానికి దూస్తే మీడియా ముందు ఘాటైన కామెంట్స్ చేసే రమేష్ నియోజకవర్గం జనాలను మెప్పించడంలో మాత్రం వెనకబడి ఉన్నారనే టాక్. బీసీ నేత ట్యాగ్ కి టీడీపీ కూడా అదే బీసీ కార్డుతో 2024లో జవాబు చెబుతుంది అంటున్నారు.
చిత్రమేంటి అంటే అంబటి రాంబాబు, రోజా, రమేష్ ముగ్గురూ కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఈ కీలకమైన సమయంలో మంత్రిగా ఉంటే 2024 ఎన్నికలలో విజయావకాశాలు పెంచుకోవచ్చు అన్నదే వారి ఆశట. మరి జగన్ కి వారి నియోజకవర్గాల్లో సీన్ తెలియకుండా ఉంటుందా. చూడాలి మరి ఏం జరుగుతుందో.