Begin typing your search above and press return to search.
బీజేపీలో భగ్గుమన్న విభేదాలు?
By: Tupaki Desk | 24 Sept 2020 5:20 PM ISTవైసీపీ సిట్టింగ్ తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ మరణంతో అక్కడ ఉప ఎన్నికలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో పాగా వేయాలని బీజేపీ యోచిస్తోంది. ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పదాదికారుల సమావేశం నిర్వహించి మరీ ఆసక్తిగా ఉన్న నేతల లిస్ట్ ను సేకరించారు.
కాగా మరో వైపు తిరుపతి బీజేపీలో నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి సీఎం జగన్ తిరుపతి వస్తున్న సందర్భంలో బీజేపీ ఎలాంటి నిరసన కార్యక్రమాలు పిలుపునివ్వలేదంటూ పత్రికా ప్రకటనను రిలీజ్ చేసి బీజేపీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ చార్జి దయాకర్ రెడ్డి ఈ వివాదానికి కారణమయ్యారు.
కాగా సీఎం జగన్ డిక్లరేషన్ పై గళమెత్తిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాస్ రెడ్డి ఈ ప్రకటనతో సంబంధం లేకుండా నిరసన కొనసాగించారు.
జగన్ పర్యటన సందర్భంగా నిరసన తెలుపాలంటూ వస్తున్న కథనాలు పార్టీ నిర్ణయం కాదని దయాకర్ రెడ్డి చెబుతున్నారు. ఇక సీఎం జగన్ డిక్లరేషన్ ఇచ్చాక తిరుమల వెళ్లాలని మరో నేత భానుప్రకాష్ రెడ్డి నిరసన కొనసాగించారు. ఇలా ఇద్దరు ఒకే పార్టీ నేతలు బీజేపీలో వేర్వేరు స్టాండ్ లు తీసుకోవడం పార్టీ కార్యకర్తల్లో గందరగోళానికి దారితీసింది.బీజేపీ నేతల మధ్య విభధాలు మరోసారి బయటపడినట్టైంది.