Begin typing your search above and press return to search.

తెలంగాణలో కాంగ్రెస్ నాలుగు ముక్కలు?

By:  Tupaki Desk   |   1 Aug 2019 2:30 PM GMT
తెలంగాణలో కాంగ్రెస్ నాలుగు ముక్కలు?
X
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత బలం అయితే ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే నేతల అనైక్యత ఆ పార్టీకి పెనుముప్పుగా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబుతో దోస్తీ చేయడం కూడా కాంగ్రెస్ ను చాలా వరకూ దెబ్బ తీసింది.

ఇక అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలతో కాంగ్రెస్ మరింతగా దెబ్బ తింది. ఈ నేపథ్యంలో పునర్నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ చాలానే కష్టపడాల్సి ఉంది.కష్టపడటం కన్నా ముందు నేతలు తమ అనైక్యతను పక్కన పెట్టి చేతులు కలపాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ శ్రేయోభిలాషులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జిలు ఒక భిన్నమైన ప్లాన్ ను అమలు పెడుతూ ఉన్నారట.

నేతల మధ్యన అనైక్యత నేపథ్యంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోరికి బాధ్యతను అప్పగించి పార్టీ వ్యవహారాలను నడిపించనున్నారట. ఎవరి ప్రాంతానికి ఆ నేతలను బాధ్యులుగా చేయబోతూ ఉన్నారని సమాచారం.

ఒక ఏరియాకు రేవంత్ రెడ్డి, మరో ఏరియాకు జీవన్ రెడ్డి, ఇంకో ఏరియాకు మల్లు భట్టీ విక్రమార్క.. ఇలా ఏర్పాట్లు చేయనున్నారట. ఇక హైదరాబాద్-రంగారెడ్డికి ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసి అక్కడి వ్యవహారాలను సమీక్షించనున్నారట.

ఇలా పార్టీని బలోపేతం చేసుకోవడానికి కాంగ్రెస్ వాళ్లు స్థానిక నేతలకు బాధ్యతలు అప్పగిస్తారట. అయినా కాంగ్రెస్ పార్టీలో ఇలా అధికారాలు అప్పగించడం కొత్త. అలా బాధ్యతలు దక్కిన వారికి, దక్కని వారికి మధ్యన రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఈ మార్పులు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయనేది చర్చనీయాంశంగా మారింది. అయితే అందరు నేతలనూ ఎంకరేజ్ చేయడానికి ఇదే మంచి నిర్ణయమని కాంగ్రెస్ ముఖ్య నేతల అనుకుంటున్నరాట”