Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ.. కేటీఆర్ వద్దకు పంచాయితీ

By:  Tupaki Desk   |   30 Dec 2020 5:30 PM GMT
ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ.. కేటీఆర్ వద్దకు పంచాయితీ
X
పాత నేతలు.. కొత్త నేతల మధ్య పంచాయితీ టీఆర్ఎస్ లో పీక్ స్టేజికి చేరింది. వికారాబాద్ జిల్లా తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. మున్సిపల్ కౌన్సిల్ వేదికగా జరిగిన పరిణామాలు ఇద్దరు నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకోవడం టీఆర్ఎస్ కలకలం రేపుతోంది.

ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి శబరిమల పర్యటనకు వెళ్తూ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. పట్టణాభివృద్ధికి సంబంధించి ప్రధానమైన మూడు అంశాలను మునిసిపల్‌ కౌన్సిల్‌ ఎజెండాలో చేరిస్తే వాటిని బలవంతంగా తొలగించారని, నిబంధనలకు విరుద్ధంగా రెండో ఎజెండాను ఆమోదించారని ఎమ్మెల్యే ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మంగళవారం స్వయంగా వెళ్లి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి చెత్త ఎజెండా అంటూ దానిని చించాల్సిందిగా ప్రతిపక్షాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మహేందర్ రెడ్డి ఆరోపించారు.

ఈ ఇద్దరి మధ్య గొడవ పార్టీలో కాక రేపింది. ఈ పరిణామాలు పార్టీకి నష్టం వాటిల్లేలా ఉన్నాయని, దీనిని సీరియ్‌స్ గా పరిగణించాలని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నిర్ణయించింది. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి శబరిమల నుంచి రాగానే ఇరువురిని పిలిచి మాట్లాడే యోచనలో కేటీఆర్ ఉన్నట్టు సమాచారం.