Begin typing your search above and press return to search.
చైనాతో ఘర్షణ: ఆ 20గంటలు భారత సైన్యం ధీరత్వం
By: Tupaki Desk | 15 Aug 2020 11:15 AM ISTచైనాతో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 21మంది భారత సైనికులు అమరులయ్యారు. మన నల్గొండకు చెందిన కల్నల్ కూడా వీరోచితంగా పోరాడి మరణించారు. ఈ క్రమంలోనే ఆ ఘర్షణ తాలూకూ స్ఫూర్తి ప్రజల్లో వెల్లివిరిసింది.
అయితే ఆ రాత్రంతా ఏం జరిగిందనే విషయంలో ఇప్పటికీ బయటపడలేదు. ప్రధాని మోడీని కూడా ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇదే విషయంపై గుచ్చి గుచ్చి అడిగాడు.
ఆ రాత్రి ఏం జరిగిందనే దానిపై తాజాగా ఐటీబీపీ దళం అధికారికంగా వెల్లడించింది. గల్వాన్ లోయలో ఇటీవల చైనాతో జరిగిన ఘర్షణలో భారత సైన్యం రాత్రంతా పోరాడి ధీటుగా బదులిచ్చిందని ఐటీబీపీ దళం తెలిపింది.
చైనా సైన్యం ముందుకు రాకుండా చాకచక్యంగా అడ్డుకున్నట్లుగా ఐటీబీపీ తెలిపింది. భారత సైనికులు అపూర్వ ధైర్య సాహసాలతో చైనాకు పలుమార్లు బదులిచ్చినట్లు చెప్పారు. మే-జూన్ లలో చైనా సైన్యంతో ఏకంగా 20 గంటల పాటు ఘర్షణలు కొనసాగాయని తెలిపింది.