ప్రతిపక్షాలను కార్నర్ చేయబోతున్నారా ?

Wed Nov 24 2021 21:00:01 GMT+0530 (IST)

completely corner entire opposition by election day

భారీ వ్యూహంతోనే మూడు రాజధానుల బిల్లును జగన్మోహన్ రెడ్డి ఉపసంహరించుకున్నారు. మూడు రాజధానుల ఏర్పాటుపై హైకోర్టులో విచారణ జరుగుతున్న విధానం ఏమిటో జగన్ కు అర్ధమైపోయింది. విచారణ పూర్తియిన తర్వాత అంతిమ తీర్పు ఎలా ఉండోబోతోందనే విషయంలో జగన్ కు క్లారిటి వచ్చేసింది.విచారణలో మొదటి నాలుగు రోజుల్లో చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు ధర్మాసనంలో మిగిలిన ఇద్దరు జడ్జీలపై ప్రభుత్వానికి నమ్మకం లేకపోవటం లాంటి అనేక కారణాలతో ప్రభుత్వం బిల్లును ఉపసంహరించుకున్నది.

ప్రభుత్వం తాజా నిర్ణయంపై ప్రతిపక్షాలు పైకి ఏమి మాట్లాడినా ఆరోపణలు చేస్తున్నా జగన్ అంతరగం ఏమిటని అర్ధమైన తర్వాత మరింతగా రెచ్చిపోతున్నాయి. ఎందుకంటే వచ్చే ఎన్నికలనాటికి మొత్తం ప్రతిపక్షాలను పూర్తిగా కార్నర్ చేయటమే జగన్ వ్యూహమని అందరికీ అర్ధమైపోయింది. మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రతిపక్షాలు ప్రధానంగా చంద్రబాబునాయుడు అడ్డుపడుతున్న విధానాన్ని ఎండగట్టడమే జగన్ ప్లాన్.

పరిపాలనా రాజధానిగా వైజాగ్ న్యాయరాజధానిగా కర్నూలును ప్రతిపక్షాలు అడ్డుకుంటున్న విధానాన్ని జనాల ముందుంచాలని జగన్ డిసైడ్ అయ్యారు. మీడియా సమావేశాల్లో టీవీ చర్చల్లో లేకపోతే పార్టీ సమావేశాల్లో నేతలు ఎన్నైనా మాట్లాడచ్చు.

కానీ ఎన్నికల సమయంలో జనాలతో నేరుగా మాట్లాడేటపుడు చెప్పాల్సిన సమాధానాలు చాలానే ఉంటాయి. జగన్ ప్రయత్నాలను కోర్టుల్లో కేసులు వేయటం ద్వారా చంద్రబాబు అండ్ కో అడ్డుకుంటున్న విషయం బహిరంగమే. జగన్ ప్రయత్నాలను అడ్డుకుంటున్న టీడీపీ అండ్ కో తమ చర్యలను జనాల ముందు ఏ విధంగా సమర్ధించుకుంటారో చూడాలి.

రాబోయే షెడ్యూల్ ఎన్నికల్లో మూడు రాజధానుల అంశమే అన్నీ పార్టీలకు చాలా కీలకమవుతుందనటంలో సందేహం లేదు. మూడు రాజధానులకు తన ప్రయత్నాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్న విధానాలనే జగన్ ప్రధానంగా హైలైట్ చేయబోతున్నారు.

తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా జగన్ ఆరోపణలకు ప్రతిపక్షాలు జనాలకు సమాధానాలు చెప్పితీరాల్సిందే. అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని కోరుకుంటున్న టీడీపీ బీజేపీ+జనసేన సీపీఐ కాంగ్రెస్ సీపీఎంలు జగన్ వ్యూహాన్ని ఏ విధంగా ఛేదిస్తాయో చూడాల్సిందే.

నిజానికి మూడు రాజధానుల అంశం తెరమీదకు వచ్చిన తర్వాత జరిగిన స్ధానికసంస్ధల ఎన్నికల్లో జనాలు వైసీపీకే మద్దతిచ్చారు. చంద్రబాబు అండ్ కో పదే పదే చెబుతున్నట్లు మూడు రాజధానులకు జనాలు గనుక వ్యతిరేకంగా ఉంటే వైసీపీకి ఏకపక్ష విజయాలు సాధ్యమయ్యేవే కాదు.

దీంతోనే మెజారిటి జనాలు జగన్ విధానాలకు మద్దతుగా ఉన్నారని ప్రతిపక్షాలకు అర్ధమైపోయుండాలి. అయినా సరే మూడు రాజధానులను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. సరే ఏదెలాగున్నా వచ్చే ఎన్నికల్లో తమ వాదనతో జనాలను ప్రతిపక్షాలు ఏ విధంగా కన్వీన్స్ చేస్తాయన్నది ఆసక్తిగా మారింది.