Begin typing your search above and press return to search.

హెరిటేజ్ చెత్తపై ఫిర్యాదు

By:  Tupaki Desk   |   9 Jan 2019 9:51 AM GMT
హెరిటేజ్ చెత్తపై ఫిర్యాదు
X
ఏపీ సీఎం చంద్రబాబు ఫ్యామిలీకి చెందిన హెరిటేజ్ సంస్థపై తాజాగా హైదరాబాద్ కు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేసింది. హెరిటేజ్ సంస్థ పర్యావరణాన్ని కాలుష్యం చేస్తోందని.. రోగాలు వ్యాపించేందుకు దోహదపడుతోందని ఫిర్యాదులో పేర్కొంది..

హెరిటేజ్ హైదరాబాద్ షోరూంలలో పాడైపోయిన.. కుళ్లిపోయిన - ఎక్సైపైర్ అయిన సరుకులు - నూనెలు - కూల్ డ్రింకులు - ఇంకా సమస్త పదార్థాలను లారీలో తీసుకొచ్చి హైదరాబాద్ శివారు గండిపేట మండలం నెక్నాంపూర్ గ్రామంలోని చెరువుల్లో తాజాగా పారబోశారు. దీనిపై స్వచ్ఛంద సంస్థ కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేసింది.

కొద్దికాలంగా స్వచ్ఛంద సంస్థ నెక్నాంపూర్ లోని 55 ఎకరాల విస్తీర్ణంలోని రెండు చెరువులను దత్తత తీసుకొని ప్రభుత్వ నిధులతో ఆ చెరువులను శుభ్రం చేస్తోంది. కాలుష్యం బారిన పడిన చెరువుల జలాలను మళ్లీ రీసైక్లింగ్ చెత్తా చెదారం తీసి అనువుగా మారుస్తున్నారు. వీరు ఇలా చెరువు పనులు చేస్తుండగానే.. తాజాగా హెరిటేజ్ కుళ్లిన పదార్థాలను లారీల్లో తెచ్చి చెరువులో పోశారు. దీంతో దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్వచ్ఛంద సంస్థ బుధవారం మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి హెరిటేజ్ పై ఫిర్యాదు చేసింది. మరి చంద్రబాబు అంటేనే ఒంటికాలిపై లేస్తున్న కేసీఆర్ సర్కారు హెరిటేజ్ పై ఎలాంటి చర్య తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.