Begin typing your search above and press return to search.
టీఆర్ ఎస్ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు
By: Tupaki Desk | 7 Oct 2020 2:40 PM ISTతెలంగాణలో ప్రజాప్రతినిధులకు.. అధికారులకు పడడం లేదన్న విషయం మరోసారి బహిర్గతమైంది. అయితే నేతల మాటలపై మౌనంగా భరించే అధికారులు చాలా మంది ఉన్నారు.కానీ ఈ వీఆర్వో మాత్రం ఊరుకోకుండా ఏకంగా ఎమ్మెల్యేపైనే పోలీసులకు ఫిర్యాదుచేయడం విశేషం.
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు గాజులరామారం వీఆర్వో శ్యాంకుమార్. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ మల్కాజిగిరి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశాడు.
మల్కాజిగిరి సత్యరాఘవేంద్ర కాలనీకి చెందిన శ్యాంకుమార్ కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం వీఆర్వోగా పనిచేస్తున్నారు. ఈనెల 3న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్వేనంబర్ 79లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలో పాల్గొన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
అయితే మరిసటి రోజు ఎమ్మెల్యే వివేకానంద తనకు ఫోన్ చేసి అసభ్యపదజాలంతో దూషించడమే కాకుండా.. తనపై అవినీతి ఆరోపణలు చేశాడని వీఆర్వో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
అయితే ఈ విషయంపై పోలీసులు స్పందించలేదు. ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. ఇక వీఆర్వోను తిట్టిన విషయంపై ఎమ్మెల్యే వివేకానంద వివరణ ఇచ్చారు. గత ఆరేళ్లుగా అక్కడ నివాసం ఉంటున్న నిరుపేదల ఇళ్లను కూల్చారని.. అడ్డు వచ్చిన గర్భిణి, మహిళలు, వికలాంగులపై దౌర్జన్యం చేశారని.. కరెంట్ మీటర్లు తీసుకెళ్లారని.. అందుకే తిట్టాల్సి వచ్చిందని తెలిపారు.