Begin typing your search above and press return to search.

యప్పీ నూడుల్స్ పైనా వివాదం

By:  Tupaki Desk   |   20 Nov 2015 3:16 PM IST
యప్పీ నూడుల్స్ పైనా వివాదం
X
రోజుకో నూడుల్స్ వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. ఇప్పటికే మ్యాగీ నూడుల్స్ ఆరోపణలతో నిషేధానికి గురై మళ్లీ ఇప్పుడు అన్ని సమస్యలు పరిష్కరించుకుని మార్కెట్ లోకి వచ్చింది. అలాగే పతంజలి నూడుల్స్ కూడా అనుమతులు లేవన్న కారణంగా ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ సమయంలో మార్కెట్ లో ఉన్న మరో నూడుల్స్ యప్పీ కూడా ఇప్పుడు విమర్శలబారినపడుతోంది. యప్పీ నూడుల్స్ లో ఫంగస్ ఉండడంతో అది తిన్న ఓ హైదరాబాద్ వ్యక్తి ఆసుపత్రి పాలవడంతో వివాదంరేగింది.

యప్పీ నూడుల్స్ తిన్న ఓ వ్యక్తి అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రిలో చేరారు. నారాయణగూడకు చెందిన వసంత్ యప్పీ నూడుల్స్ తిని ఆసుపత్రి పాలయ్యారు. ఆయన తిన్న నూడుల్స్ లో ఫంగస్ ఉండడం వల్లే అలా జరిగిందని వైద్యులు తేల్చారు. దీంతో వసంత్ ఆహార నియత్రణ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాలం చెల్లిన నూడుల్స్ ను యప్పి విక్రయిస్తోందని ఆయన ఆరోపించారు. దీంతో ఆహార నియంత్రణ శాఖ అధికారులు తనిఖీలకు ఆదేశించినట్లు సమాచారం. అయితే.. ఈ వ్యవహారాన్ని మరింత పెంచుకోవడం ఇష్టంలేని యప్పీ ప్రతినిధులు వసంత్ తో రాజీకి యత్నిస్తున్నట్లు సమాచారం.

వేలాది మంది వినియోగదారుల సంక్షేమం కోసం వసంత్ రాజీపడకుండా వాస్తవాలు బయటపెట్టి కంపెనీలు మంచి ఉత్పత్తులనే మార్కెట్ లో విక్రయించేలా చేయగలిగితే మంచిదే.