Begin typing your search above and press return to search.

ఆ పదవులకు తెలంగాణలో పోటాపోటీ?

By:  Tupaki Desk   |   24 Sept 2020 9:45 AM IST
ఆ పదవులకు తెలంగాణలో పోటాపోటీ?
X
నామినేటెడ్, అధికార పార్టీలో పదవులకే కాదు.. ఇప్పుడు తెలంగాణలో యూనివర్సిటీ వీసీ పోస్టులకు కూడా ఫుల్ గిరాకీ పెరిగిందట.. ఒక్కో పోస్టుకు డిమాండ్ ఓ రేంజ్ లో ఉందట.. ఉస్మానియా యూనివర్సిటీ కోసం పోటీపడుతున్న ఆ ఇద్దరు ప్రముఖుల మధ్య పోటీపోటీ ఇప్పుడు సెగలు కక్కుతోంది.

తెలంగాణలో పలు వర్సిటీలకు వైస్ చాన్స్ లర్ లేక ఏడాది కావొస్తోంది. ఇంచార్జీల పాలనలోనే నెట్టుకొస్తున్నాయి. విశ్వవిద్యాలయాలకు ఉప కులపతుల నియామకాన్ని వెంటనే పూర్తి చేయాలని ఇటీవల కేసీఆర్ ఆదేశించడంతో విద్యాశాఖ వర్గాల్లో కదలిక వచ్చింది.

దీంతో ఆశావహులు ఈ అత్యున్నత పదవి కోసం లాబీయింగ్ మొదలుపెట్టారట.. తెలంగాణలో మొత్తం 10 వర్సిటీల వీసాల నియామకానికి ప్రభుత్వం సెర్చ్ కమిటీలు వేసింది. రాష్ట్రంలోని 9 వర్సిటీలకు కలిపి 935 దరఖాస్తులు వచ్చాయట.. వీటిల్లో ఒక్క వ్యక్తి పలు వర్సిటీలకు దరఖాస్తు చేసుకున్నట్టు గుర్తించారట..

ఒక్క పొట్టి శ్రీరాములు వర్సిటీకి తప్ప మిగతా అన్ని విశ్వవిద్యాలయాలకు దరఖాస్తులు 100కు పైగానే వచ్చాయి. తక్కువ దరఖాస్తులు పొట్టిశ్రీరాములు వర్సిటీకి 23 రాగా.. ఎక్కువ దరఖాస్తులు అంబేద్కర్ వర్సిటీకి వచ్చాయని సమాచారం. ఏకంగా 157మంది ఈ వర్సిటీ వీసీ పోస్టు కోసం దరఖాస్తు చేశారు. అంబేద్కర్ వర్సిటీకి పేరుంటుందని.. పెద్దగా అలిగేషన్స్, తలనొప్పులు ఉండవని దీనికి పెద్ద ఎత్తున దరఖాస్తు చేసినట్టు సమాచారం.

తెలంగాణ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ లు అయిన లింబాద్రి, వెంకటరణలు కూడా ఉస్మానియా వర్సిటీ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడం విశేషం. వీరిద్దరూ వివాదరహితులు కావడం.. ప్రభుత్వంలో పనిచేయడంతో వీరిద్దరిలో ఒకరికి ఉస్మానియా వీసీ పదవి దక్కవచ్చని అంటున్నారు. ఈ మేరకు పెద్దస్థాయిలో లాబీయింగ్ జరుగున్నట్టు సమాచారం. కేసీఆర్ ఆశీస్సుల మేరకు అత్యున్నత ఉస్మానియా వర్సిటీ పోస్టు దక్కనుంది.