Begin typing your search above and press return to search.
పీపీఈ కిట్ల పేరు చెప్పి రూ. లక్షల్లో వసూళ్లు.. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై సర్వత్రా విమర్శలు
By: Tupaki Desk | 15 Aug 2020 5:00 PM ISTకరోనా బారిన పడిన జనం అతలాకుతలం అవుతున్నారు. ప్రతి ఇంటా వైరస్ బారిన పడినవారు కనిపిస్తున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. వేలాది మంది తమ ఉద్యోగాలను పోగొట్టుకొని ఇంటిపట్టునే ఉండాల్సి వస్తోంది. ఆదాయం వచ్చే మార్గాలు పూర్తిగా మూసుకుపోయాయి. జీవనం సాగించడమే కష్టమవుతోంది. అదే సమయంలో కరోనా వైద్యానికి పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రులన్నీ కరోనా బాధితులతో నిండిపోవడంతో.. ఇదే అదునుగా తెలంగాణలోని ప్రైవేట్ ఆస్పత్రులు చెలరేగిపోతున్నాయి.
బాధితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రులకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం కరోనా వైద్యానికి ధరలు నిర్ణయించింది. ఆ మేరకు మాత్రమే బాధితుల నుంచి వసూలు చేయాలని ఆదేశాలిచ్చింది. ఎక్స్ రే లకు, రక్తపరీక్షలకు ఇలా ఒక్కొక్క చికిత్సకు ఒక్కో ధర నిర్ణయించింది. కరోనా రోగికి ట్రీట్మెంట్ చేసే సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది పీపీఈ కిట్లు ధరించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం అన్ని పరీక్షలకు నిర్ణయించిన మేరకు మాత్రమే డబ్బు వసూలు చేయాలని ఆంక్షలు పెట్టడంతో బిల్లుల్లో పీపీఈ కిట్లు పేరు చెప్పి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు.
కరోనా పీపీఈ కిట్టు ధర రూ.600 వరకు ఉండగా ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలు రూ. 20 వేల నుంచి 30 వేల వరకు డబ్బు వసూలు చేస్తున్నాయి. కరోనా బాధితుల నుంచి కొన్ని హాస్పిటళ్లు రూ. 10 నుంచి రూ. 15 లక్షల వరకు లాగుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా, కొన్ని ఆస్పత్రులకు ప్రభుత్వం అనుమతులు రద్దు చేసింది. నిర్ణయించిన మేరకే ట్రీట్మెంట్ కు డబ్బు వసూలు చేయాలని నిబంధనలు పెట్టినా.. అవేమీ పట్టించుకోకుండా పీపీఈ కిట్ల పేరు చెప్పి లక్షల్లో సొమ్ము వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని పీపీఈ కిట్లకు కూడా ధర నిర్ణయించాలని కోరుతున్నారు.