Begin typing your search above and press return to search.

కరోనా వేళ.. వారి సుడి అంతలా తిరిగిపోయిందట

By:  Tupaki Desk   |   30 March 2020 10:30 AM IST
కరోనా వేళ.. వారి సుడి అంతలా తిరిగిపోయిందట
X
కరోనా కారణంతో అన్ని రంగాలకు చెందిన ఉద్యోగుల్లో ఎక్కువ శాతం ఇప్పుడు ఇంటి నుంచి పని చేస్తున్నారు. అయితే.. కొందరు ఉద్యోగులు మాత్రం తప్పనిసరిగా ఆఫీసులో ఉండే పని చేయాల్సిన పరిస్థితి. అలా అని.. రోజువారీగా ఆఫీసు నుంచి ఇంటికి.. ఇంటి నుంచి ఆఫీసుకు తిరగలేని పరిస్థితి. అది ప్రమాదకరం కూడా. ఇలాంటివేళ.. ముంబయికి చెందిన ఒక కంపెనీ వినూత్నంగా ఆలోచించటమే కాదు.. ఊహించని రీతిలో నిర్ణయాన్ని తీసుకుంది.

తమ ఉద్యోగులు తప్పనిసరిగా ఆఫీసులోనే పని చేయాల్సిన నేపథ్యంలో కమోడిటీ ఎక్సైంజ్ ఎమ్ సీఎక్స్ సంస్థ మాత్రం తమ ఉద్యోగుల్ని ఆఫీసుల్లోనే ఉండిపోవాలని కోరింది. దీనికి తగ్గట్లే.. ఆఫీసుల్లో ఏర్పాట్లు చేయనున్నారు. దేశ వ్యాప్తంగా ఈ సంస్థకు నాలుగు వందల మంది ఉద్యోగులు ఉండగా.. ఒక్క ముంబయిలోనే మూడు వందల మంది ఉన్నారు. కీలక ఉద్యోగులు పలువురు ఆఫీసులోనే ఉండి విధులు నిర్వహిస్తున్నారు. దీంతో.. సంస్థ భనంలోనే వీరికి బస ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది.

అపత్ కాలంలో తమ కుటుంబాన్ని వదిలేసి.. ఆఫీసులోనే ఉంటున్న ఉద్యోగుల త్యాగానికి ప్రతిఫలంగా వారికి నెలవారీగా చెల్లించే మొత్తానికి మూడు రెట్లు కలిపి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే.. కొందరు ఉద్యగులకు రెట్టింపు శాలరీ.. అతి కొద్దిమంది ఉద్యోగులకు మాత్రం మూడు రెట్ల జీతాలు ఇవ్వాలని నిర్ణయించారు. దేశంలో చాలా కంపెనీలు కరోనా వేళ.. కష్టపడుతున్నాయి. కానీ.. వారెవరికీ దక్కని ప్రతిఫలం ఎమ్ సీఎక్స్ ఉద్యోగులకు దక్కిందని చెప్పక తప్పదు.