Begin typing your search above and press return to search.

కమిట్మెంట్ ఉన్న నేత చంద్రబాబుః చిరంజీవి

By:  Tupaki Desk   |   20 April 2021 7:30 AM GMT
కమిట్మెంట్ ఉన్న నేత చంద్రబాబుః చిరంజీవి
X
ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా టీడీపీ నేత‌ల‌తోపాటు ప‌లువురు ప్ర‌ముఖులు బాబుకు బ‌ర్త్ డే గ్రీటింగ్స్ చెబుతున్నారు. దీంతో.. సోష‌ల్ మీడియాలో శుభాకాంక్ష‌ల వెల్లువ కొన‌సాగుతోంది.

ఈ క్ర‌మంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా చంద్ర‌బాబుకు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న‌ ట్వీట్ చేశారు. ‘బాగా శ్రమించే, కమిట్మెంట్ ఉన్న‌ నాయకుల్లో ఒక‌రైన నారా చంద్ర‌బాబు నాయుడు గారికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. ఆయురారోగ్యాల‌తో సంతోషంగా జీవిస్తూ.. ప్ర‌జ‌ల‌కు జీవితాంతం సేవ చేయాలి’ అని పోస్టు చేశారు.

కాగా.. మెగాస్టార్ అప్ క‌మింగ్ మూవీ ఆచార్య‌కు క‌రోనా అడ్డంకులు ఎదుర‌వుతున్నాయి. కొవిడ్ విజృంభించ‌డంతో ఈ చిత్రం షూట్ వాయిదా వేశారు. ఇప్ప‌టికే ఈ చిత్రంలో న‌టించే సోనూ సూద్ కరోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. రోజురోజుకూ కేసులు పెరుగుతుండ‌డంతో షూటింగ్ నిలిపేశారు. దీంతో.. మే 13న రిలీజ్ అవుతుందా? లేదా? అన్న‌ది సందిగ్ధంగా మారింది.