Begin typing your search above and press return to search.

అమ్మడేం చేసినా పట్టించుకోకూడదట

By:  Tupaki Desk   |   5 Sept 2015 12:04 AM IST
అమ్మడేం చేసినా పట్టించుకోకూడదట
X
గత రెండు రోజులుగా నాటి పోర్న్ స్టార్ సన్నిలియాన్ నటించిన యాడ్ కు సంబంధించిన రచ్చ తెలిసిందే. ఆమె నటించిన కండోమ్ యాడ్ గురించి సీపీఐ సీనియర్ నేత అతుల్ కుమార్ ఒక ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. అత్యాచారాలు జరిగితే దానికి సన్నిలియాన్ బాధ్యత వహించాలని వ్యాఖ్యానించటం తెలిసిందే. నిజానికి రాజకీయ నేతలు కానీ సీన్లోకి వస్తే.. సినిమా తారలు పెదవి విప్పటానికి పెద్దగా ఇష్టపడరు.

కానీ.. సన్నిలియాన్ అందుకు భిన్నం కదా.. అందుకే ఆమె ట్విట్టర్ లో రియాక్ట్ అయ్యారు. తన గురించి మాట్లాడిన వారికి చురకలు అంటించటమే కాదు.. ఓ ఉచిత సలహా ఒకటి ఇచ్చి పారేశారు. అధికారంలో ఉన్న నాయకులు తన గురించి ఆలోచించి టైమ్ వేస్ట్ చేసే కన్నా.. ప్రజలకు సాయం చేసే విషయంలో మరింత శ్రద్ధ చూపిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించింది.

సన్నిలియాన్ రియాక్ట్ అయ్యిందో లేదో.. వెంటనే ఆమెకు మద్ధతుగా బాలీవుడ్ నాటి నటి శిల్పాశెట్టి నిలిచారు. నిజమే.. సన్నిలియాన్.. శిల్పాశెట్టి లాంటి వారు ఎవరికి వారు.. ఏం చేసినా ఎవరూ ఏమీ మాట్లాడకూడదు. తానే విధంగా వ్యవహరించినా కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే.. అది వారి వృత్తిపరమైన అంశంగా చెప్పుకొస్తారు. అయినా.. నేతలు మాత్రమే ప్రజలకు సేవ చేయాలా? సన్ని లియాన్ లాంటి వారికి సామాజిక బాధ్యత ఉండదా? బట్టలు విప్పేసి.. తనకిష్టమైంది ఏం చూపించినా పెద్దగా పట్టించుకోకూడదని సన్నిలియాన్.. తాను.. తన భర్త లాంటి వారు కుంభకోణాల్లో కూరుకుపోయినా శిల్పాశెట్టి అండ్ కో లాంటి వారి గురించి ఎవరు మాట్లాడకూడదన్నట్లుగా ఉంది వారి వ్యవహారం. మరి.. ఈ విషయంపై నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.