Begin typing your search above and press return to search.

బాబుపై థ‌ర్టీ ఇయ‌ర్స్ పృధ్వీ స‌టైర్ !

By:  Tupaki Desk   |   3 Jun 2018 6:49 AM GMT
బాబుపై థ‌ర్టీ ఇయ‌ర్స్ పృధ్వీ స‌టైర్ !
X
స‌రైన హోంవ‌ర్క్ ఉంటే వ్యాఖ్య‌లు ఎంత ఘాటుగా ఉంటాయో కొంద‌రు నేత‌ల్ని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఏళ్ల‌కు ఏళ్లు రాజ‌కీయాల్లో ఉన్నా.. ప్ర‌సంగాల్లోనూ.. మాట‌లు చెప్పే విష‌యంలో ఏ మాత్రం ప్ర‌భావం చూపించ‌లేని బాబు ఫ్యామిలీపై కొంద‌రు వేస్తున్న స‌టైర్లు అదిరిపోతున్నాయి.

టాలీవుడ్ రంగంలో థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండస్ట్రీ పేరుతో తెలుగువారికి సుప‌రిచిత‌మైన క‌మేడియ‌న్ పృధ్వీ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ఉద్దేశించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అమితంగా ఇష్ట‌ప‌డే పృధ్వీ తాజాగా నెల్లూరు వీఆర్సీ మైదానంలో జ‌రిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబును ఉద్దేశించి మాట్లాడుతూ.. తానేదో థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అంటూ సినిమాల్లో పాత్ర‌లు వేసుకుంటూ బ‌తికేస్తున్న‌ట్లుగా చెప్పారు. చంద్ర‌బాబు సైతం త‌న మాదిరే పార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అంటూ చెప్పుకుంటున్నార‌న్నారు. బాబు పేరును పల‌క‌టానికి కూడా త‌న‌కు మ‌న‌సు ఒప్ప‌టం లేద‌న్నారు.

40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం ఉన్న వ్య‌క్తి.. 40 ఏళ్ల వ‌య‌సున్న జ‌గ‌న్ ను చూసి ఎందుకు భ‌య‌ప‌డుతున్నారంటూ ప్ర‌శ్నించారు. త‌న‌కు బాబు పేరును ప‌ల‌క‌టం కూడా ఇష్టం లేద‌న్నారు. సూటిగా వేసిన ఈ స‌టైర్ వీడియో సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.