Begin typing your search above and press return to search.
మహేశ్ ‘మహర్షి’ సీన్ చూపించిన ఆ జిల్లా కలెక్టర్.. ఎస్పీ
By: Tupaki Desk | 10 Dec 2020 1:00 PM ISTఒకరు చిత్తూరు జిల్లా కలెక్టర్. మరొకరు ఆ జిల్లా ఎస్పీ. ఇంకొకరు తిరుపతి స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఏఎస్పీ.. వీరితో పాటు.. మున్సిపల్ కమిషనర్. వీరంతా చేసిన పనిని చూసినంతనే ఆ మధ్య సంచలన విజయం సాధించిన మహేశ్ బాబు ‘మహర్షి’ మూవీలో ఒక సీన్ గుర్తుకు రావాల్సిందే. ఇంతకీ ఈ చిత్తూరు జిల్లా ప్రముఖులు ఏం చేశారంటే..
రోటీన్ కు భిన్నంగా.. తమ హోదాల్ని పక్కన పెట్టేసిన ప్రముఖులు.. ఫ్యాంట్లు పైకి లేపి.. ఫుల్ హ్యాండ్ షర్ట్స్ ను పైకి మడత పెట్టి.. తలపాగా కట్టి.. పొలంలోకి నాట్లు వేసిన వైనం చూస్తే ఆసక్తికరంగానే కాదు.. కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేలా ఉందని చెప్పాలి. వీరు చేసిన పనికి స్థానిక రైతులు ఆనందానికి గురయ్యారు. జిల్లాకు చెందిన కీలక అధికారులు ఇలా తమ హోదాల్ని.. కార్లను పక్కన పెట్టేసి పొలంలోకి దిగి.. పని చేసిన వైనం అందరిని ఆకర్షించటమే కాదు.. జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. తిరుపతి శివారులో ఈ సీన్ చోటుచేసుకుంది.
చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా.. తిరుపతి అర్బన్ ఎస్పీ రమేశ్ రెడ్డి.. తిరుపతి స్పెసల్ ఎన్ ఫోర్సుమెంట్ బ్యూరో ఏఎస్పీ రిషాంత్ రెడ్డి.. మున్సిపల్ కమిషనర్ గిరిషాలు పొలంలో నాట్లు వేశారు. తిరుపతి శివారుకు వెళ్లిన వారు.. పొలంలోకి ఉత్సాహంగా దిగి నాట్లు వేయటం.. రైతుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఫోటోలకు ఫోజులు ఇచ్చే దానికి భిన్నంగా ఈ యువ అధికారులంతా పొలంలోకి దిగి.. నిజంగానే నాట్లు వేయటంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతులు చెప్పిన విషయాన్ని జాగ్రత్తగా విన్న వారు.. ఆ తర్వాత తమ అధికారిక కార్యక్రమాలకు వెళ్లిపోయారు. వీరి తీరు.. జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నలుగురు అధికారులు యువ అధికారులే కావటం గమనార్హం.