Begin typing your search above and press return to search.

కోడిపందాల్లో డిజిట‌ల్ పేమెంట్స్‌

By:  Tupaki Desk   |   26 Dec 2016 8:30 PM GMT
కోడిపందాల్లో డిజిట‌ల్ పేమెంట్స్‌
X
సంక్రాంతి సంబరాలకు ఇంకా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ...పందెం రాయుళ్లు కోడి పందాల‌కు ఇప్ప‌ట్నుంచే ప్ర‌ణాళిక‌తో ముందుకు పోతున్నారు. కోడి పందాలు నిర్వ‌హించవ‌ద్ద‌ని కోర్టు ఆదేశాలు ఉన్న‌ప్ప‌టికీ...వాటిని లైట్ తీసుకొని ఈ ఏడాది కూడా కోడి పందాలకు పందెం రాయుళ్లు సై అంటూ బరుల తయారీకి సన్నద్ధమవుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో ఏ ఒక్కరి చేతిలోనూ నగదు లేకుండా పోయిన నేప‌థ్యంలో పందాల నిర్వాహకులు కొత్త వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో డిజిట‌ల్ లావాదేవీలు మొద‌లుపెట్టార‌ని అంటున్నారు. అదే స‌మయంలో ఈసారైనా పోలీసులు పందాలను అడ్డుకుంటారా? లేక చేతులెత్తేస్తారా? అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.

కోడి పందాల‌ను నిర్వ‌హించ‌వ‌ద్ద‌ని హైకోర్టు ఆదేశాలు ఉన్న నేప‌థ్యంలో వాటిని తూ.చ. తప్పకుండా అమలు చేస్తామని చెప్పిన పోలీసులు పండగ మూడు రోజులూ చేతులెత్తేసి ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. ఒక్కో బరికి ఒక్కో లెక్క చొప్పున మామూళ్లు తీసుకుని సలాం కొట్టారు. ఇలా ఒక్క ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోనే దాదాపు 400కు పైగా బరుల్లో రాత్రీపగలు తేడా లేకుండా ఫ్లడ్‌లైట్ల వెలుగులో కోళ్లు కత్తులు దూశాయి. పచ్చని 'పశ్చిమ' మూగజీవాల రక్తంతో తడిసిముద్దయ్యింది. రాజకీయ నాయకులు, సినీతారలు సైతం పందాల్లో పాల్గొని కేరింతలు కొట్టారు. పండుగ మూడు రోజుల్లో రూ.వంద కోట్లకుపైగా చేతులు మారినట్లు అంచనా. అదే రీతిలో ఈ ఏడాది జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు.ఇప్పటికే భీమవరం వంటి ప్రాంతాల్లో ముందస్తుగానే హోటల్‌ లో రూంలు బుక్‌ చేసుకున్న ట్లు సమాచారం.

ఇదిలాఉండ‌గా పెద్ద నోట్ల రద్దుతో ఏ ఒక్కరి చేతిలోనూ నగదు లేకుండా పోయింది. దీంతో పందాల నిర్వాహకులు కొత్త వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. స్వైపింగ్‌ మిషన్లను వినియోగించే ఆలోచన కూడా చేస్తున్నారని తెలిసింది. అదే స‌మ‌యంలో భూములను - ఆస్తులను ఫణంగా పెట్టి పందాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారని స‌మాచారం. అదే జరిగితే పందాల్లో పాల్గొని ఓడిన వారి కుటుంబాలు రోడ్డున పడక తప్పదు. పోలీసులు ఈసారైనా వీటిని అడ్డుకోకపోతే పరిస్థితులు అత్యంత భయానకంగా మారే ప్రమాదం ఉందని ప‌లువురు వాపోతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/