Begin typing your search above and press return to search.

గంజాయికి కేరాఫ్​ వైజాక్​ - హైదరాబాద్​.. రెచ్చిపోతున్న స్మగ్లర్లు!

By:  Tupaki Desk   |   20 Dec 2020 4:40 PM IST
గంజాయికి కేరాఫ్​ వైజాక్​ - హైదరాబాద్​.. రెచ్చిపోతున్న స్మగ్లర్లు!
X
తెలుగురాష్ట్రాల్లో గంజాయి అడ్డాగా మారింది. విశాఖపట్టణం, హైదరాబాద్​ కేంద్రాలుగా గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా.. దాని మూలాలు హైదరాబాద్​ లేదా విశాఖపట్టణంలో ఉంటున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో కొందరు యథేచ్ఛగా గంజాయిని సాగుచేస్తున్నారు. స్మగ్లర్లు గంజాయిని సేకరించి.. విదేశాలకు తరలిస్తున్నారు. అక్కడక్కడా చెక్​పోస్టులు పెట్టినా గంజాయి దందా ఆగడం లేదు.

వివిధ రూపాల్లో పోలీసులు కళ్లుగప్పి గంజాయిని తరలిస్తున్నారు. అయితే అక్కడక్కడ పట్టుబడుతున్నప్పటికీ.. దారిమళ్లించి గంజాయిని యథేచ్చగా తీసుకెళ్తున్నారు. విశాఖపట్టణం జిల్లా అరకు, పాడేరు, చింతపల్లి గంజాయిని భారీగా సాగుచేస్తున్నట్టు సమాచారం. గంజాయి స్మగ్లర్లు టూరిస్టులుగా వైజాక్​ వెళ్లి భారీగా గంజాయిని సేకరిస్తున్నారు. విశాఖలో పండించిన గంజాయిని బీహార్, కలకత్తా, ఒరిస్సా, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు సమాచారం.
నిందితులు వివిధ రూపాల్లో గంజాయిని తరలిస్తున్నారు.

అగనంపూడిలో గ్యాస్‌ సిలిండర్‌ అడుగు భాగం కట్‌ చేసిన గంజాయి ప్యాకెట్లు పెట్టి తరలిస్తున్న స్మగ్లర్లను పట్టుకున్నారు. కొందరు స్మగ్లర్లు ద్రవపదార్థంలోనూ గంజాయిని తీసుకెళ్తున్నారు. విశాఖపట్టణంతోపాటు హైదరాబాద్​ కూడా గంజాయికి అడ్డాగా మారింది. అయితే విశాఖపట్టణం నుంచి తీసుకొచ్చిన గంజాయిని హైదరాబాద్ లో నిలువచేస్తున్నట్టు సమాచారం. మరోవైపు హైదరాబాద్​లోని పలు ఇంజినీరింగ్​ కళాశాలల్లో సమీపంలో స్మగ్లర్లు వీటిని నిలువ ఉంచి విద్యార్థులకు విక్రయిస్తున్నట్టు సమాచారం. ఇటీవల హైదరాబాద్​లోని ఉప్పల్​లో 200 కిలోల గంజాయి పట్టుబడింది.